Raghavendhra rao : బాక్స్ ఆఫీస్ ను దడదడలాడించిన సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు….!

Raghavendhra rao : దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్. ఇక హీరోయిన్స్ ను గ్లామరస్ గా చూపించడంలో ఈయన తరువాతే ఎవరైనా. ఇక ఎటువంటి ప్రయోగాలకైనా ముందుండి మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో సూపర్ స్టార్ కృష్ణ, తెలుగు తెరకు కొత్తరకం సినిమాలను పరిచయం చేసిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఇక అలాంటి సూపర్ స్టార్ తో దర్శకేంద్రుడి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు తొమ్మిది, అయితే అందులో దాదాపు అన్ని సినిమాలు హిట్లుగా నిలిచాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ తన తనయుడు మహేష్ ను ‘రాజకుమారుడు’ సినిమాతో దర్శకేంద్రుడు ద్వారానే ఇండస్ట్రీలోకి లాంచ్ చేశారు.

సూపర్ కాంబినేషన్ లో సూపర్ హిట్స్…

రాఘవేంద్ర రావు, కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘భలే కృష్ణుడు, ఈ సినిమా పర్వాలేదానిపించింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘ఘరానా దొంగ’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ‘ఊరికి మొనగాడు’ సినిమా సూపర్ సక్సెస్ అందుకుని వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ అని నిరూపించారు. ఇక నాలుగో సినిమాగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా ‘అడవి సింహాలు’. కృష్ణ, కృష్ణం రాజు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ద్విభాషా చిత్రంగా ఏక కాలంలో హిందీ తెలుగులో భారీ బడ్జెట్ తో నిర్మించారు. హిందీలో జితేంద్ర, ధర్మేంద్ర హీరోలుగా తెరకెక్కించారు.

ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఐదో సినిమా ‘శక్తి’, ఇందులో డ్యూయల్ రోల్ చేశారు కృష్ణ. ఇక ఆరో సినిమా ‘ఇద్దరు దొంగలు’ శోభన్ బాబు, కృష్ణ కలిసి నటించిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఏడో సినిమాగా వచ్చిన ‘అగ్నిపర్వతం’ సినిమా గురించి చెప్పనక్కర్లేదు కృష్ణ గారి కెరీర్ లో అదొక మైలు రాయి లాంటి సినిమా. ఇక ఎనిమిదో సినిమాగా వచ్చిన ‘వజ్రాయుధం’ కూడా మంచి హిట్ అందుకుంది. ఇక తొమ్మిదో సినిమా కృష్ణ గారు అతిధి పాత్రలో మెరిశారు. అదే మహేష్ మొదటి సినిమా ‘రాజకుమారుడు’ ఈ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ చేశారు. అయితే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.