Allu Aravind:తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఎలాంటి మంచి అనుబంధం ఉందో మనకు తెలిసిందే. చిరంజీవి అల్లు అరవింద్ ఇద్దరు వరుసకు బావ బావమరిది అయినప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య ఎంతో మంచి అన్యోన్యత ఉండేది. ఏ చిన్న వేడుక జరిగిన మెగా అల్లు కుటుంబం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ వేడుకను జరుపుకునే వారు.
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ క్రమక్రమంగా మెగాస్టార్ చిరంజీవిని దూరం పెడుతూ నందమూరి నటసింహం బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అల్లు అరవింద్ వ్యవహార శైలి చూస్తే అందరికీ ఇది నిజమేనని అర్థమవుతుంది. అల్లు అరవింద్ ఆహా సమస్థను స్థాపించి ఇందులో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలయ్యను తీసుకువచ్చారు. ఇలా ఈ కార్యక్రమంతో వీరి బంధం బలపడింది.ఇక గతంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా వెళ్లారు.
ఇకపోతే అల్లు అరవింద్ త్వరలోనే తన బ్యానర్ లో బాలకృష్ణ చేత ఓ సినిమా చేయనున్నారని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.ఇకపోతే అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కోసం బాలకృష్ణ ముఖ్యఅతిథిగా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా అల్లు అరవింద్ చిరంజీవిని దూరం పెడుతూ బాలకృష్ణకు దగ్గర అవుతున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…