Featured

Chiranjeevi : సూపర్ స్టార్ కృష్ణ గారి స్థలం అమ్మి అప్పులు తీర్చిన చిరంజీవి…!

Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అద్భుతంగా ఉన్నపుడు ఆస్తులను పోగేసినా ఆ తరువాత కెరీర్ డౌన్ ఫాల్ అయితే అంతే వేగంగా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోతాయి. అయితే చాలా మటుకు సీనియర్ హీరోయిన్లు ఆర్థిక క్రమశిక్షణ లేక తమ చివరి రోజుల్లో డబ్బు లేక ఇబ్బందిపడినవారు ఉన్నారు. అయితే హీరోలలో అలాంటివి చాలా తక్కువ అయితే కొన్ని అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నపుడు వారికి సంబంధించిన ఆస్తులను అమ్మి అప్పులను తీర్చిన సందర్భాలు దాదాపు అందరి హీరోల జీవితాల్లోనూ చూస్తాము, అలాంటి ఘటన మెగాస్టార్ జీవితంలోనూ ఉంది. ఏదో తొలినాళ్ళలో అయ్యింటుంది అనుకుంటే పొరపాటే అది కూడా ఆయన మెగాస్టార్ గా తెలుగు సినిమా సింహాసనం మీద కూర్చున్నాక జరిగింది.

కృష్ణ గారి స్థలం అమ్మి అప్పు తీర్చిన చిరు…

చెన్నై లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండటం వల్ల మొదట్లో స్టూడియోలు, అన్నీ అక్కడే ఉండేవి. అలా చాలామంది తెలుగు నటులు కూడా అక్కడే ఆస్తులను చేసుకుని కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉండిపోగా మరి కొంతమంది హైదరాబాద్ వచ్చేసారు. అలా సూపర్ స్టార్ కృష్ణ గారు అరుణాచలం గార్డెన్స్ పక్కన చెన్నై లో ఒక ఐదెకరాల స్థలం తీసుకుని కృష్ణ గార్డెన్స్ గా నామకరణం చేసి షూటింగులకు పనికి వచ్చేలా డెవలప్ చేసారు. ఆ గార్డెన్స్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఈనాడు’. ఈ సినిమా కోసం మురికివాడకు సంబంధిచిన సెట్స్ వేశారు, ఇక ఆ తరువాత ఇతర హీరోల సినిమాల షూటింగ్స్ కూడా కృష్ణ గార్డెన్స్ లో జరిగేవి. ఇక అందులో ఒక ఎకరా చిరంజీవి గారు ఎపుడో కొనుగోలు చేసారు.

ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ తరువాత కాంగ్రెస్ లోకి విలీనం చేసేసారు. ఇదంతా తెలిసిన కథ అయితే ఆ సమయంలో పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టారట చిరు అందుకోసం అప్పు చేశారట. ఆ అప్పును తీర్చడానికి చెన్నై కృష్ణ గార్డెన్స్ లోని ఎకరా స్థలం అమ్మేశారట. దాంతో వచ్చిన 25 కోట్ల డబ్బులను అప్పులు తీర్చారట. ఇక ఈ విషయాన్ని చిరంజీవి గారికి అతి సన్నిహితుడైన ఎన్వి ప్రసాద్ గారు గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన చాలా ఇబ్బందులు పడ్డారంటూ చెప్పారు. ఇక కృష్ణ గార్డెన్స్ లోని నాలుగు ఎకరాలు పద్మాలయా వారు డెవలప్మెంట్ కు ఇచ్చేసారు. ప్రస్తుతం అక్కడ అరుణాచలం స్టూడియో కూడా లేదు, ఇక కృష్ణ గార్డెన్స్ కూడా అపార్ట్మెంట్స్ తో ఉంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago