Tollywood : ఓ వైపు సీనియర్ హీరోలైన కృష్ణ, శోభన్ బాబు వంటి వారు ఇంకా సూపర్ హిట్లు అందుకుంటున్న రోజుల్లో అప్పుడు కుర్రహీరోలుగా ఎంటర్ అయిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు వరుస హిట్లు అందుకుంటున్న రోజుల్లో చిరంజీవి లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో వరుసగా ఏడాదికి నాలుగైదు సినిమాలను చేస్తున్న సమయంలో… 1989 లో ఏకంగా ఈ అగ్ర హీరోలందరూ కలిసి 28 చిత్రాలలో నటించారు. అయితే ఈ చిత్రాలలో కొన్ని హిట్ కొన్ని ఫ్లాప్ కొన్ని మ్యూజికల్ హిట్స్ మరికొన్ని ఇండస్ట్రీ స్టైల్ ను మార్చి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. మరి మొత్తంగా 1989 లో విజేతగా నిలిచిన హీరో ఎవరో తెలుసా…
యువ సామ్రాటే బాక్స్ఆఫీస్ మొనగాడు…
ఆ ఏడాది ఏఎన్ఆర్ 3, కృష్ణ 7, శోభన్ బాబు 3, చిరంజీవి 4, బాలకృష్ణ 4, నాగార్జున 5, వెంకటేష్ 5 ఇక మిగిలిన హీరోల చిత్రాలను చూస్తే మొతంగా 1989 లో విడుదల అయిన స్ట్రైట్ చిత్రాలు 94. అయితే హీరోలలో స్టార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది యువసామ్రాట్ అక్కినేని నాగార్జున. ఆయన నటించిన రెండు సినిమాలు ఆయనను తన కెరీర్ లో మరో మెట్టు ఎక్కించాయి. అవే గీతాంజలి, శివ సినిమాలు ఒకటి నాగార్జున లోని నటనను చూపితే మరొకటి సినిమా ఇండస్ట్రీ పంతాను మార్చేసిన సినిమా. గమ్మత్తుగా రెండు సినిమాలు మొదటి రోజు జనాలకు పెద్దగా ఎక్కలేదు. గీంతంజలి సినిమాను కొన్నిసెంటర్లలో తీసేసాక మెల్లగా సినిమా చాలా మందికి ఎక్కింది అలా శత దినోత్సవం జరుపుకుంది.
ఇక శివ సినిమా కూడా మొదట్లో అర్థం కాలేదు ఆ తరువాత ఆ సినిమా ఎంతలా జనాలకు చేరిందంటే కాలేజీ లో సైకిల్ చైన్స్ పట్టుకునేంతగా. ఇక గీతాంజలి సినిమాలోని అన్ని పాటలూ మ్యూజికల్ హిట్స్ అప్పట్లో యూత్ ని పిచ్చెక్కించాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఏడు సినిమాల్లో 5 ప్లాప్స్ కాగా మహేష్ బాబు తో కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఇక శోభన్ నటించిన సినిమాలు అంతగా అలరించకపోవడం తో ఆయన ఒక ఏడాది బ్రేక్ తీసుకుని పునరాలోచించుకోవాల్సి వచ్చింది. ఇక చిరంజీవి కి 1989 సూపర్ ఇయర్, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ ఆయనకు వచ్చింది ఈ ఏడాదే.
ఇక రుద్రనేత్ర, లంకేశ్వరుడు ప్లాప్ గా నిలిస్తే స్టేట్ రౌడీ సినిమా మంచి హిట్. ఇక నందమూరి బాలయ్య ఖాతాలో సాలిడ్ హిట్ ‘ముద్దుల మావయ్య’ సినిమాతో ఈ ఇయర్ దొరికింది. అశోక చక్రవర్తి, బల గోపాలుడు సినిమాలు ప్లాప్ అయినా ‘బాల గోపాలుడు’ మ్యూజికల్ సూపర్ హిట్ అయింది. ఇక బాలయ్య ను మాస్ హీరోగా మరో అడుగు ముందుకు నడిపిన చిత్రం ఆ ఇయర్ వచ్చిన ‘భలే దొంగ’ సినిమా. ఇక 1989 ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ నాగార్జున, ఇక సూపర్ హిట్ సినిమాల్లో అధికంగా నటించి ఆ ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ గా ఏకంగా 11 సినిమాలను చేసిన విజయశాంతి స్టార్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…