Rajamouli : దర్శకధీరుడి సక్సెస్ ఫార్ములా ఏంటో తెలుసా… ప్రతి సినిమా విజయం వెనుక ఏముంది…!

Rajamouli : దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన ప్రతి సినిమా హిట్. అది ఎలా ఒక హీరో అయినా, ఒక డైరెక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా ప్రతి సినిమా హిట్ అవ్వడమంటే గొప్ప విషయమే. అయితే ఆ ఘనత మన జక్కన్నకు దక్కుతుంది. రాజమౌళి 2001లో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ దగ్గరినుండి నేడు విడుదలైన ఆర్ఆర్ఆర్ 2022 వరకు అన్ని సినిమాలు హిట్ అయినవే. ఒక సినిమా కూడా ప్లాప్ అవ్వకుండా ప్రతి సినిమా హిట్ ఎలా అయింది అంటే అది రాజమౌళి పర్ఫెక్షన్ అనే చెప్పాలి.

ప్రతి పాత్ర ను మలిచే జక్కన్న…

కమర్షియల్ యాడ్స్ తీస్తూ తన కెరీర్ మొదలు పెట్టిన జక్కన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1తోనే మంచి విజయాన్ని చూసాడు. ఆ తరువాత ప్రతి సినిమాకు తన రేంజ్ పెంచుతూ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఒక టాప్ హీరో అయినా మామూలు హీరో అయినా రాజమౌళి సినిమా కాబట్టి హిట్ అనే రేంజ్ కి ఎదిగిపోయాడు. ఒక మగధీర ఎంత హిట్టో, సునీల్ తో తీసిన మర్యాద రామన్న కూడా సూపర్ హిట్. హీరోతో సంబందం లేదు, కేవలం కథ, తన డైరెక్షన్ తోనే సినిమా హిట్ చేస్తాడు రాజమౌళి. అంతే కాదు తన సినిమాకు అంతే ప్రచారము కల్పించే గొప్ప బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటాడు. సినిమా ఎంత బాగున్నా ప్రేక్షకులు థియేటర్ కి రావాలంటే కావాల్సింది పబ్లిసిటీ, సినిమాకు పబ్లిసిటీ చేయడంలో జక్కన దిట్ట.

తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను అందించడం రాజమౌళి కి ప్లస్ పాయింట్. రాజమౌళి కి మాయాబజార్, బెన్ హెర్ లాంటి ఇంగ్లిష్ సినిమాలంటే ఇష్టం. అయితే జక్కన తన సినిమాల్లో ఖచ్చితంగా ఎమోషన్స్, యాక్షన్, ఇలా అన్నీ ఉండేలా చూసుకుంటాడు. ప్రతి ఆడియన్ కి తన సినిమాలో ఏదో ఒక అంశం కనెక్ట్ అయ్యేలా చూసుకోవడం లో రాజమౌళి దిట్ట. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రేక్షకులు ఆ కథలోని పాత్రలకు కనెక్ట్ అవుతారు. హీరో ని ఎంత బలంగా చూపుతాడో విలన్ ని కూడా అంతే బలవంతుడిగా చూపడం రాజమౌళి ప్రత్యేకత. ఒక్క సన్నివేశం అయినా తనకు సంతృప్తి కలిగే వర్షకు తీసే రాజమౌళి ప్రతి ఫ్రేమ్ తాను అనుకున్నట్టే పర్ఫెక్ట్ గా చేస్తాడు. పక్కా కొలతలతో ఒక బిర్యానీ చేసినట్టు అందుకే ఏ ఆర్టిస్ట్ అయినా ఒక్కసారైనా జక్కన డైరెక్షన్లో సినిమా చేయాలనుకుంటాడు.

రాజమౌళి బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసాడు. బాహుబలి తో హాలీవుడ్ టచ్ చేసిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్స్ మనసు దోచుకున్నాడు. ఇపుడు రాజమౌళి ఇండియా ప్రైడ్ అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంతటి ఘనత సాధించడంలో తన కష్టం ఒక్కో సినిమాకు తాను చూపే పట్టుదల, ఓపిక , తనను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. అందుకే రాజమౌళి తో పనిచేసే ఎవరైనా తనను పని రాక్షసుడు అంటారు.