Suchendra Prasad: పవిత్ర లోకేష్ గత కొంతకాలం నుంచి ఈనటి పేరు సోషల్ మీడియాలో, మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది.కన్నడ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఎన్నో కన్నడ సినిమాలలోనూ అలాగే తెలుగు సినిమాలలోను నటించి విపరీతమైన గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో ఒక్కసారిగా నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కూడా వార్తల్లో నిలిచారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం వల్ల పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ స్పందిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను పవిత్ర లోకేష్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తను నా భార్యేనని, అయితే వివాహమైన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రం తీసుకోలేదని సుచేంద్ర వెల్లడించారు.
మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది విదేశీ విధానం ఆ విధానం మాకు నచ్చకపోవటం వల్లే ఉద్దేశపూర్వకంగా తాము మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోలేదని ఈయన వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికెట్ మినహా మిగిలిన ఆధార్ కార్డు, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ వంటి వాటిని పరిశీలిస్తే పవిత్ర నా భార్య అని అర్థమవుతుంది. ఇకపోతే మేమిద్దరం భార్యాభర్తలుగా ఎన్నో కార్యక్రమాలకు కూడా హాజరయ్యామని, నేను తనని హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నానని సుచేంద్ర వెల్లడించారు.
హిందూ సాంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరిగింది….
ఇకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్ విదేశీ విధానం కావడంతో కేవలం మ్యారేజ్ సర్టిఫికెట్ మాత్రమే తీసుకోలేదు మిగిలిన ఏ విధమైనటువంటి ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ చూసిన తను నా భార్య అని స్పష్టంగా అర్థమవుతుంది.ఇకపోతే వీటిని ఆధారంగా చేసుకుని నేను నా మ్యారేజ్ సర్టిఫికెట్ చాలా సులభంగా తయారు చేయించుకోవచ్చు అంటూ సుచేంద్ర వెల్లడించారు. అయితే గతంలో పవిత్ర లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను సుచేంద్రను వివాహం చేసుకోలేదని కేవలం ఆయనతో రిలేషన్ లో మాత్రమే ఉన్నానని ప్రకటించడం గమనార్హం. ఏది ఏమైనా నరేష్ పవిత్ర వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…