Rakesh Master : రాకేష్ మాస్టర్ ని అవమానించిన శేఖర్ మాస్టర్ భార్య… శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ కి మధ్య తగువుకు కారణం ఏమిటి…!

Rakesh Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు.

శేఖర్ మాస్టర్ తో గొడవ…

రాకేష్ మాస్టర్ జీవితం చూసుకుంటే అసలు క్లాసికల్ డాన్స్ కానీ ఎటువంటి డాన్స్ లో కానీ శిక్షణ తీసుకోకుండానే డాన్స్ లో మెళకువలు నేర్చుకున్నారు. ఇక డాన్స్ నేర్చుకుని తిరుపతిలోనే డాన్స్ శిక్షణ కూడా ఇచ్చేవారు రాకేష్ మాస్టర్. అలా హైదరాబాద్ వచ్చి చాలా మందికి శిక్షణ ఇస్తూ ఢీ షో ద్వారా మరింత పేరు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లకు గురువు. అలాగే హీరో ప్రభాస్ కు డాన్స్ శిక్షణ ఇచ్చింది కూడా రాకేష్ మాస్టరే. ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్న శేఖర్ మాస్టర్ ఇప్పుడు పెద్ధ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే రాకేష్ మాస్టర్ ఆయన గురువని ఎపుడూ చెప్పే శేఖర్ మాస్టర్ కి రాకేష్ మాస్టర్ కి గొడవలు రావడం రాకేష్ మాస్టర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా శేఖర్ మాస్టర్ మీద బాగా ఫైర్ అయ్యారు.

శేఖర్ మాస్టర్ ని ఎంత విమర్శించినా రాకేష్ మాస్టర్ తన గురువని తన వల్లే ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నానని శేఖర్ చెప్పేవారు. అయితే రాకేష్ మాస్టర్ మాత్రం శేఖర్ మాస్టర్ బయటికి వెళ్ళాక తనతో మాట్లాడలేదని, చిరంజీవి తో డాన్స్ అవకాశాలు వచ్చిన విషయం కూడా చెప్పలేదని, తన పాప పుట్టినరోజు గ్రాండ్ గా చేసిన శేఖర్ తనను మాత్రం పిలవలేదని రాకేష్ మాస్టర్ బాధపడ్డారు. ఇక శేఖర్ ఇంటికి ఫోన్ చేసి అదే విషయం అడిగితే శేఖర్ మాస్టర్ భార్య నీకు చెప్పాలా అంటూ అవమానకరంగా మాట్లాడిందని అప్పట్లోనే రాకేష్ మాస్టర్ తెలిపారు. అప్పటి నుండే శేఖర్ ను విమర్శించడం మొదలు పెట్టారు రాకేష్ మాస్టర్.