Featured

Rakesh Master : బెంజ్ కారు నుండి గంజి తాగే స్టేజ్ కి రాకేష్ మాస్టర్ జీవితం ఎలా పడిపోయింది… అందుకు కారణం ఎవరు…!

Rakesh Master: సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజీ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు.

సినీ సెలబ్రిటీ నుండి యూ ట్యూబ్ స్టార్ వరకు…

స్టార్ హీరోలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ 2000సంవత్సరం సమయంలోనే 40 వేల రెంటు కడుతూ నాలుగు కార్లను మెయింటైన్ చేసాడు. అలాంటి స్టార్ డమ్ చూసిన రాకేష్ మాస్టర్ నేడు రెండు వేల రూపాయల రెంటు కట్టిన అద్దె ఇంట్లో ఉంటూ టిక్ టాక్ చేసుకునే వాళ్ళతో వీడియోలు చేసుకుంటూ తాగుడుకు బానిసగా మారి చివరికి ప్రాణం విడిచాడు. టాలెంట్ మాత్రమే మనల్ని నిలబెట్టదు. ఆ టాలెంట్ తో పాటు క్రమశిక్షణ, వినమ్రత ఉండాలి. రాకేష్ మాస్టర్ తన నోటి వల్లే ఎన్నో సమస్యలను తెచ్చుకున్నారు. తన ఇద్దరు భార్యలు పిల్లలు దూరం అవడానికి కారణం ఆయన నోరే. అందరూ ఉన్నా చివరి రోజుల్లో ఒంటరిగా అనాధాశ్రమంలో ఉంటూ కాలం వెళ్ళదీశారు. చేతనైన సాయం చేసి ఎంతో మందికి అన్నం పెట్టిన రాకేష్ మాస్టర్ చివరి రోజుల్లో అనాధగా మారడానికి కారణం ఆయన ఎంచుకున్న దారే. సినిమాల్లో ఒక స్టార్ డమ్ చూసిన ఆయన అదే ఇండస్ట్రీ మీద రాళ్ళు వేశారు. యూట్యూబర్ లో ఇంటర్వ్యూలలో నోటికి వచ్చినట్లు ఎంతో మంది ఇండస్ట్రీకి సంబంధించిన వారిని విమర్శించారు.

ఒకప్పుడు ఎంతో గొప్పగా కనిపించిన ఆయన నేటి ఆయన ప్రవర్తన, తాగి ఇంటర్వ్యూల్లో పాల్గొనడం చూసి ఏంటి ఈ రాకేష్ మాస్టర్ అనేలా చేసుకున్నాడు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంతో కష్టపడాలి అదే దిగజారడానికి ఎన్నో మెట్లు ఉన్నాయి. అలానే రాకేష్ మాస్టర్ డాన్స్ సొంతంగా నేర్చుకుని ఎంతో ఎత్తు ఎదిగినా తన ప్రవర్తన మధ్యానికి బానిస అవడం వల్ల దిగజారిపోయాడు. నేషనల్ ఛానెల్స్ లో ఆయన మరణ వార్త రావల్సిన రాకేష్ మాస్టర్ సిటీ ఛానెల్, యూట్యూబ్ కే పరిమితమవడానికి కారణం ఆయన ప్రవర్తన ఆయన ఎంచుకున్న మనుషులే అని చెప్పొచ్చు. ఆయన జీవితం నేటి యువతకు ఖచ్చితంగా గుణపాఠమే.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago