Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి మూడవ తరం వారసులు అడుగుపెట్టారు. మెగా కోడలు ఉపాసన నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అమ్మాయి జన్మించడంతో పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ ఇప్పటికే అపోలో హాస్పిటల్ కి చేరుకొని తమ వారసురాలని చూస్తూ సంబరపడిపోతున్నారు. అయితే తనకు మనవరాలు పుట్టడంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తన మనవరాలకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ పేదికగా స్పందిస్తూ.. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాకతో కోట్లాదిమంది మెగా అభిమానులతో పాటు మాకు సంతోషాన్ని పంచావు. రామ్ చరణ్ ఉపాసనలను తల్లిదండ్రులను చేసావ్ మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ ను చేశావు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కోట్లాదిమంది మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు నిన్ను ఆశీర్వదిస్తున్నారు అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
ఈ విధంగా రాంచరణ్ తన మనవరాలికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేవిధంగా ఇతర సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్ సైతం రామ్ చరణ్ ఉపాసన దంపతులను పేరెంట్స్ క్లబ్ లోకి ఆహ్వానించడమే కాకుండా ఈ సమయంలో మీరు గడిపే ప్రతిక్షణం జీవితాంతం గుర్తుండిపోయే ఓ జ్ఞాపకంలో మిగులుతుంది ముగ్గురు చాలా సంతోషంగా ఉండాలి అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ కూడా వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…