Movie News

Rakesh Master: రాకేష్ మాస్టర్ కుటుంబ బాధ్యత మాదే… గణేష్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

Rakesh Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందరో స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన రాకేష్ మాస్టర్ ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఇలా స్టార్ హీరోలతో ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేయించిన రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందాడు. అంతే కాకుండా ఎంతోమందికి డాన్స్ కూడా నేర్పించాడు. ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో కూడా పాల్గొన్నాడు.

ఇదిలా ఉండగా ఆయన శిష్యులు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన అవకాశాలు రాకపోవటంతో కామెడీ షోలు, ఇంటర్వ్యు లలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఈ ఇంటర్వ్యులలో రాకేష్ మాస్టర్ చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాలలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా తన శిష్యుడు శేఖర్ మాష్టర్ గురించి రాకేష్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబందించిన వీడియోలను షేర్ చేసేవాడు. ఆయన షేర్ చేసే వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అయ్యేవి. ఇదిలా ఉండగా అదివారం ఉదయం రక్తవిరేచనలు, వాంతులు అవటంతో ఆయన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సోమవారం రోజు బొరబండ లో రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు నిర్వహించారు.

Rakesh Master : ఆర్థికంగా అండగా నిలుస్తాం…


ఇక రాకేష్ మాస్టర్ చివరి చూపు కోసం ఆయన శిష్యులు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో గణేష్ మాస్టర్, జానీ మాస్టర్ రాకేష్ మాస్టర్ పాడే కూడా మోసారు. ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడిన గణేష్ మాస్టర్..” తన గురువు మరణం గురించి బాధపడుతూ.. రాజేష్ మాస్టర్ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయిందని, ఆయన శిష్యులు అందరూ కలిసి ఆయన కుటుంబానికి అండగా నిలుస్తామని, వారి కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలను తాము చూసుకుంటాము అంటూ ఈ సందర్భంగా గణేష్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago