Featured

Ramcharan: జరగండి పాట కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా.. అయినా ఫలితం లేకుండా పోయిందా?

Published

on

Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా తర్వాత బుచ్చిబాబు అనంతరం సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలలో రామ్ చరణ్ బిజీ కాబోతున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాబోతున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇటీవల చరణ్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి జరగండి జరగండి అనే పాటను విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రాసినటువంటి ఈ పాటను విడుదల చేయగా ఈ పాటకు అనుకున్న స్థాయిలో వ్యూస్ రాలేదని చెప్పాలి. ఈ పాట పట్ల మెగా ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

18 కోట్లు ఖర్చు..

రామ్ చరణ్ వంటి స్టార్ హీరోకి పడాల్సిన పాట కాదు అంటూ కామెంట్లో పెడుతున్నారు. ఇక ఈ పాట కోసం ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయిలో ఖర్చు చేసిన సినిమాలోని ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Trending

Exit mobile version