Featured

Upasana: కూతురితో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న చరణ్ ఉపాసన.. మనసు దోచిందంటూ పోస్ట్?

Published

on

Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి గేమ్ ఛేంజర్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం రామ్ చరణ్ వైజాగ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వైజాగ్ లో మరికొద్ది రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతుంది అని తెలుస్తుంది.

ఈ విధంగా రాంచరణ్ ఈ సినిమా పనులలో వైజాగ్ లోనే ఉండటంతో ఉపాసన తన కుమార్తె క్లిన్ కారాతో కలిసి వైజాగ్ వచ్చారు. ఇలా వైజాగ్ రావడంతో రామ్ చరణ్ షూటింగ్ విరామ సమయంలో తన కుమార్తెతో కలసి సరదాగా బీచ్ వెళ్లి ఎంజాయ్ చేశారు ఈ విధంగా రాంచరణ్ తన కుమార్తెతో కలిసి సముద్రపు అలలను తాకుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ తన కుమార్తెను ఆడిస్తున్నారు.

మొదటి ఎక్స్పీరియన్స్..
ఇలా ఈ ముగ్గురు మొదటిసారి బీచుకు వెళ్లి ఎంజాయ్ చేయడంతో ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమ్మ నాన్నలుగా మొదటిసారి కుమార్తె క్లీన్ కారా తో కలిసి బీచ్ వెళ్ళామని వైజాగ్ మనసును దోచిందని తెలిపారు. ఇది తన కూతురితో కలిసి మొదటి బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్లీన్ కారా చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.

Advertisement

Trending

Exit mobile version