Ram Gopal Varma : నన్ను ఒక కిల్లర్ దగ్గర పరిచయం చేసాడు… రాత్రి రెండు గంటల సమయంలో వడపావ్ కోసం గన్ చూపి బెదిరించాడు..: ఆర్జీవీ

Ram Gopal Varma : తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. ‘శివ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకోచ్చి అలానే సినిమా పంథాను మార్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. వివాదాలతో బతికే వర్మలో ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడు, ఇది ఎవరూ కాదనలేని సత్యం. తాను తీసిన పాత సినిమాలను చూస్తే ఎవరైనా ఆర్జీవి ఫ్యాన్ అవ్వాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఉన్న వర్మ వేరు. అయితే తాజాగా తన సినిమాల్లో మాఫియాను చూపించే విధానం గురించి విశేషాలను వర్మ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

గన్ చూపించి బెదిరించాడు…

మాఫియా అంటే నాకు చాలా ఆసక్తి అలానే ఇష్టం అంటూ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను చూసిన మాఫియా వేరంటూ అంతకుముందు అమితాబ్ బచ్చన్ సినిమాలు దీవార్, డాన్ వంటి వాటిలో మాఫియా చూపించినా అది రియాలిటీకి దగ్గర లేదు. అయితే నేను చూసిన మాఫియా అలా లేదు, వాళ్ళు చాల సింపుల్ గా సాధారణంగా ఉంటారు అంటూ వర్మ తెలిపారు. తనకు ఒక నిర్మాత తన ఆఫీస్ లో ఒక షూటర్ ని పరిచయం చేసాడని, అతను చోటా రాజన్ కి పనిచస్తాడు అంటూ మాఫియా ఒకప్పుడు జనంలోనే ఉండేవారు అంటూ తెలిపారు. ఇక అజయ్ తివారి అనే వ్యక్తికి మాఫియా గురించి బాగా తెలుసు, అతనితో మాట్లాడితే కొంత ఐడియా వస్తుంది సినిమా కోసం అని అతనిని కలిసాను. అతను మాఫియాతో పనిచేయడు. కేవలం దావూద్ ఇబ్రహీం గర్ల్ ఫ్రెండ్ మందాకినికి బాడీగార్డ్ గా ఉండేవాడు. అయితే మాఫియాలో చాలా మంది అతనికి తెలుసు, మంచి కనెక్షన్స్ ఉన్నాయి.

అతనితో ఒకసారి టైగర్ మెమన్ తో ఉన్నపుడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వడపావ్ తినాలని అనిపించిందట టైగర్ మెమన్ కి దీంతో బాంధ్ర ప్రాంతంలో ఒక షాప్ కి వెళ్లి గన్ చూపి బెదిరించి మరీ వడపావ్ చేయించుకుని టైగర్ మెమన్ తిన్నాడట. ఇలాంటి విషయాలను అజయ్ తివారి నాకు చెప్పినపుడు వీళ్ళు ఎంత సింపుల్ గా ఉంటారో అర్థమైంది. మాఫియా ఆర్గనైస్డ్ వ్యవస్థ, అందులో బిజినెస్ కోణంలో ఆలోచిస్తే శత్రువులు అంటూ ఉండరు, కేవలం ఆ బిజినెస్ లో అడ్డు వచ్చిన వారిని హత్య చేస్తూ ఉంటారు అంటూ వర్మ మాఫియా అంటే తనకు ఎంత ఇంట్రస్ట్ ఉందో చెప్పారు.