Featured

Actress Jyothi : పెళ్లి చేసుకుని తప్పు చేశా… రెండేళ్ల బాబుతో నడిరోడ్డుపైన కూర్చొని ఏడ్చా…: నటి జ్యోతి

Jyothi : ‘ఓ మై లవ్’ సినిమాతో 18 ఏళ్లకే ఇండస్ట్రీకి పరిచయమైన జ్యోతి ఎమ్ఎస్ రెడ్డి గారి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక ‘హంగామా’ సినిమాతో హీరోయిన్ గా ఆలీ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హీరోయిన్ గా కొనసాగలేకపోయినా వాంప్ పాత్రలను ఎక్కువగా సినిమాల్లో చేసింది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ లో జ్యోతి పాల్గొని ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న జ్యోతి కామెడీ సినిమాలు ఎక్కువగా చేసినా ప్రస్తుతం తక్కువగా సినిమాల్లో కనిపిస్తోంది.

నడిరోడ్డు మీద చంటి బిడ్డతో…

సినిమాల్లో కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకపోయినా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు జ్యోతి చెప్పింది. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని, కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో నా కంటే వయసులో కొంత చిన్నవాడినే పెళ్లి చెసుకున్నాను అంటూ జ్యోతి తెలిపారు. సరైన గైడన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తొందరపడి పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపారు. పెళ్లయ్యాక దుబాయ్ వెళ్లి స్థిరపడగా భర్త వేధింపులు భరించలేక మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసానని ఇక ఒంటరిగా తన బాబుతో తాను బ్రతుకుతున్న సమయంలో జరిగిన సంఘటనల వల్ల నన్ను ఉన్న పలంగా మా ఓనర్ ఇల్లు ఖాళీ చేయించారు. తప్పు చేయకపోయినా దోషగా నిలబడాల్సి వచ్చింది. ఇక ఇలాంటి ఇష్యూ లో ఆడవాళ్ళను లాగుతారు కానీ మగవాళ్ళను సేవ్ చేస్తారు.

ఇక్కడ కూడా నేనే బలి అయ్యాను అంటూ జ్యోతి చెప్పారు. ఇక రెండేళ్ల బాబుతో ఇంటి కోసం వెతికితే ఎవరూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, నడిరోడ్డు మీద పడ్డాను. కానీ నేను ధైర్యంగా నా బిడ్డ కోసం బ్రతికాను. అప్పుడు జరిగిన సంఘటనలు నన్ను చాలా దృఢం చేసాయి. ఇపుడు ఇలాంటివి నేను పట్టించుకోవడం మానేసాను నా బాబు నేను అన్నట్లుగా మా ప్రపంచం అంతే, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు స్నేహితులుగా ఉంటారు, అలాంటి స్నేహితులు నాకు ఉన్నారు, ఇక నా బాబు అంతే నాకు ప్రపంచం అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago