Movie News

Koratala Shiva: తప్పు నా ఒక్కడిదే కాదు… ఆచార్య విషయంలో మెగాస్టార్ కు కౌంటర్ ఇచ్చిన కొరటాల!

Koratala Shiva: తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ అనంతరం మిర్చి సినిమాతో దర్శకుడిగా మారారు. దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా పేరుపొందారు. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువచ్చాయి.

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులు కొరటాల పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తప్పు మొత్తం కొరటాలదే అన్నట్టు వ్యవహరించారు.

ఈ సినిమా ఫ్లాప్ కావడంతో పలుమార్లు చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతూ మేము డైరెక్టర్ చెప్పినట్టే చేశామని ఈ సినిమా ఫెయిల్యూర్ మొత్తం కొరటాలపై వేశారు. అయితే తాజాగా కొరటాల శివ ఈ విషయంపై స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు.డైరెక్టర్ కొరటాల శివతో ఇదివరకు చేసిన నిర్మాతలు ఎవరు కూడా తనని విమర్శించలేదు కానీ చిరు ఇలా విమర్శించేసరికి కొరటాల స్పందించారు.

Koratala Shiva: ఇకనైనా విమర్శలు ఆపాలి…

ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంలో తన ఒక్కడి తప్పు మాత్రమే లేదని ఇకపై అయినా ఈ విమర్శలు ఆపడం మంచిది అంటూ ఈయన చిరంజీవికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మరి ఇప్పటికైనా చిరంజీవి ఆచార్య విషయాన్ని వదిలిపెడతారా లేక అలాగే కొరటాలని ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago