Rajamouli: దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి గత కొద్ది రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండటం వల్ల ఈయన అమెరికాలో పర్యటిస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజమౌళికి గతంలో ఈయన హృతిక్ రోషన్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.
ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రాజమౌళి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బిల్లా సినిమా ట్రైలర్ పోస్టర్స్ చూసిన తర్వాత ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ కూడా నథింగ్ అంటూ రాజమౌళి అప్పట్లో హృతిక్ రోషన్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తాజాగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నలకు రాజమౌళి సమాధానం చెబుతూ ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది. మరి ఈ కామెంట్స్ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాయో నాకు తెలియదు కానీ అప్పట్లో నేను హృతిక్ రోషన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని ఒప్పుకున్నారు.
ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ నథింగ్ అన్నాను. అయితే ఇది తప్పు అని, నేను తప్పు పదాలను ఎంపిక చేసుకున్నానని రాజమౌళి ఒప్పుకున్నారు.అయితే తాను హృతిక్ రోషన్ ను కించపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడలేదని ఈయన గత విషయాల గురించి సమాధానం చెప్పడంతో చాలామంది ఈయన మాటల పై స్పందిస్తూ తప్పును ఒప్పుకోవడం కూడా మీ గొప్పతనం మరోసారి మీ వినయాన్ని చూపారు అంటూ రాజమౌళి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…