Mamatha Mohandas: మమతా మోహన్ దాస్ పరిచయం అవసరం లేని పేరు తెలుగు తమిళ కన్నడ భాషలలో పలు సినిమాలలో నటించి సందడి చేస్తున్న ఈమె ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో పెద్ద ఎత్తున సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించి సందడి చేసిన మమత మోహన్ దాస్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించారు.
మమతా మోహన్ దాస్ గతంలో భయంకరమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఈ వ్యాధి నుంచి క్రమక్రమంగా కోలుకున్నటువంటి ఈమె మరోసారి లింఫోమా అనే మరొక భయంకరమైన వ్యాధి బారిన పడి ఈ వ్యాధితో పోరాడి బయటపడ్డారు. ఇలా రెండుసార్లు ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడి బయటపడిన ఈమెను దేవుడు చిన్న చూపు చూస్తున్నాడు.
ఇలా ఇప్పటికే పలు వ్యాధుల నుంచి కోలుకున్నటువంటి మమతా మోహన్ దాస్ తాజాగా మరొక వ్యాధి బారిన పడినట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా తన సమస్యను తెలియజేశారు. ప్రస్తుతం తాను బొల్లి వ్యాధితో బాధపడుతున్నానని, ఈ వ్యాధి కారణంగా తన చర్మం రంగు మొత్తం మారిపోతుంది అంటూ ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా తన ఆరోగ్య సమస్యను తెలియజేశారు.
ఇలా ఈమె క్రానిక్ ఇమ్యూన్ డిజాస్టర్ తో బాధపడుతున్నానంటూ తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ అసలు విషయం వెల్లడించారు. ఇలా రెండుసార్లు ప్రాణాంతకర వ్యాధులతో పోరాడి బయటపడిన ఈమెకు మరోసారి ఇలాంటి వ్యాధి రావడంతో అభిమానులు ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…