Nara Brahmani: నందమూరి వారసురాలిగా నారా ఇంటి కోడలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రాహ్మిని గురించి మనందరికీ సుపరిచితమే. బాలయ్య పెద్ద కుమార్తెగా, నారా లోకేష్ భార్యగా అందరికీ సుపరిచితమైన బ్రాహ్మిని వ్యాపార రంగంలో దూసుకుపోతూ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈ సినిమా మొదటిరోజు మొదటి షో చూసిన అనంతరం నారా బ్రాహ్మణి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
వీర సింహారెడ్డి సినిమా చూసిన అనంతరం ఈమె మీడియాతో మాట్లాడుతూ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్క సన్నివేశంలోనూ ప్రతి ఒక్క పాటలోను నాన్న నటన అద్భుతం అంటూ తెలియజేశారు.ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ కూడా నాన్న చాలా అద్భుతంగా చెప్పారంటూ బ్రాహ్మిని తన తండ్రి నటించిన ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పమని మీడియా నారా బ్రాహ్మనీని అడిగారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ నాన్నలా డైలాగ్ చెప్పడం తన వల్ల కాదని.. నాన్నల డైలాగ్స్ ఎవరు చెప్పలేరు అంటూ బాలకృష్ణపై ఈమె కామెంట్ చేశారు. ఇలా బాలకృష్ణ నటన గురించి ఆయన డైలాగ్ డెలివరీ గురించి నారా బ్రాహ్మిని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…