Featured

Producer Ambika Krishna : చంద్రబాబు నన్ను మోసం చేసాడు…: నిర్మాత అంబికా కృష్ణ

Producer Ambika Krishna : ప్రముఖ పారిశ్రామికవేత్తగా సినిమా నిర్మాతగా అలానే పొలిటీషియన్ గా ఉన్న అంబికా కృష్ణ అందరికీ సుపరిచితులు. ఆయన నిర్మించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మరి కొన్ని డిజాస్టర్ గా మిగిలి ఆయనకు భారీగా నష్టం కలిగించాయి. ఇక సినిమా ఇండస్ట్రీ బాగోగుల కోసం రాష్టం విభజన జరిగాక అధికార పార్టీలో ఉండి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇక రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విషయాలను తాజాగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చంద్రబాబు నన్ను మోసం చేసాడు…

నిర్మాతగా సినిమాలను నిర్మించి సక్సెస్ అయిన అంబికా కృష్ణ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే అంశాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. 1999 సమయంలో తండ్రి చనిపోవడంతో ఆ కార్యక్రమాలలో ఉన్నపుడు ఆ సమయంలో సీఎం గా ఉన్న చంద్రబాబు గారు ఈవివి గారి ద్వారా నాకు ఫోన్ చేయించి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి వరకు కాంగ్రెస్ లో ఉన్న నేను టీడీపీలో చేరాలని అడిగితే ఆలోచిస్తానని చెప్పాను అంటూ తెలిపారు అంబికా కృష్ణ. ఆ తరువాత మళ్ళీ రాఘవేంద్ర రావు గారు ఈవివి గారు ఫోన్ చేసి తరచూ అడిగేవారు.

ఇక చంద్రబాబు గారు నన్ను పిలిచి మాట్లాడాలని అడిగితే వెళ్లి కలిసి పార్టీలో చేరాను, ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక అలా మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ తరువాత రెండో సారి నాకు టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు గారు. నియోజకవర్గంలో బీసీ లకు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పి వేరేవాళ్లకు ఇచ్చినా సైలెంట్ గా ఉన్నాను. అందరి సమక్షంలో ఎమ్మెల్సి టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అలా ఎమ్మెల్సి కూడా ఇవ్వలేదు. మా నియోజకవర్గంలో రెండు సార్లు వేరేవాళ్లకి ఇచ్చారు. ఇంత మోసం భరించలేక నేను పార్టీ నుండి బయటికి వచ్చేసాను బీజేపీ లో కొనసాగుతున్నాను అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

నూతన డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ శివప్రసాద్!

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ ను వివిధ వర్గాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో…

3 hours ago

మీ పేరు ‘A’తో మొదలవుతుందా? అయితే మీ స్వభావం ఇలా ఉంటుందట!

పేరులోని మొదటి అక్షరం వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందనే భావన సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యంలో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా ‘A’ అక్షరంతో…

3 hours ago

సాయంత్రం ఉప్పు ఇస్తే నష్టం? పెద్దలు ఎందుకు చెప్పారో తెలుసా!

భారతీయ కుటుంబాల్లో ఉప్పు అనేది కేవలం వంటకాల్లో రుచి కోసం ఉపయోగించే పదార్థం మాత్రమే కాదు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం…

4 hours ago

శుభం కోసం కట్టిన తోరణం.. ఎప్పుడు మార్చాలో తెలుసా?

పండుగలైనా, శుభకార్యాలైనా ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తోరణం కట్టడం తెలుగు కుటుంబాల్లో సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇది కేవలం అలంకరణ…

4 hours ago

చీరలో పురుషులు.. 900 ఏళ్ల చరిత్ర.. తిరుపతి గంగమ్మ జాతర వెనుక అద్భుత కథ!

తిరుపతి గంగమ్మ జాతర దక్షిణ భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన జానపద ఉత్సవాల్లో ఒకటి. తిరుపతి నగరంలో ప్రతి ఏడాది…

4 hours ago

రోజూ ఖర్జూరం తింటున్నారా? ఇలా తింటేనే పూర్తి లాభం!

ఖర్జూరం చిన్నదే కానీ, ఆరోగ్యానికి పెద్ద మేలు చేసే సహజ ఆహారం. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకుంటే శరీరానికి అవసరమైన…

4 hours ago