Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ విమర్శలు.. దమ్ముంటే అలా చేసి చూపించండి!

Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ విమర్శలు.. దమ్ముంటే అలా చేసి చూపించండి!

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు షేర్ చేసిన వీడియోలో.. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు. దివంగత వైఎస్ రాజ శేఖర్ రెడ్డి కుమారుడు కాకపోతే వైఎస్ జగన్ భారీ సంఖ్యలో ఓట్లను సాధిస్తారా అని ప్రశ్నించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న భావన వల్లనే ప్రజలు వైఎస్ జగన్‌కు ఓట్లు వేశారని అన్నారు. వినియోగదారుల(సినిమా టికెట్ల) సంతృప్తిపై ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టిన ప్రజలు తమ పాలనపై నిస్సహాయత వ్యక్తం చేస్తే మీరు దిగిపోతారా..? సినిమా రేట్ల వ్యవహారంలో మీ విధానం అలాగే ఉందని విపర్శలకు దిగాడు.

ఉత్పత్తికి, వినియోదారుడికి మధ్య ప్రభుత్వం జోక్యం ఎందుకు?. బాహుబలిని రూ.50 కోట్లతో తీస్తే.. నేను ఐస్ క్రీమ్ ను రూ.5లక్షలతో తీస్తాను. రెండిటికి ఒకటే మూవీ రేట్ అంటే అది మొత్తం మార్కెట్ ని నాశనం చేస్తోంది. టికెట్లు కొనే వినియోగదారుడు ఇబ్బంది పడకూడదని.. ప్రభుత్వం అంటుంది.. కదా.. ఏదో ఒక సినిమాను మీరు తీసి.. థియేటర్లలో ఫ్రీగా వేసేయండి అంటూ విరుచుకుపడ్డాడు.

మీకు అంత కెపాసిటీ లేనప్పుడు.. అదే కెపాసిటీ ఉన్న వ్యక్తులు తీసే సినిమాలకు ఇలాంటివి పెట్టడం సరికాదన్నారు. ఇటీలవల పేర్నీ నాని మాట్లాడుతూ.. సినిమా నచ్చకపోతే ఎవరి డబ్బులు వాళ్లకి ఇస్తారా అని అన్నారు..? మనం ఏదైనా హోటల్ కి వెళ్లి.. ఇష్టం వచ్చింది తిని.. బిల్ నచ్చలేదని కట్టకుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది.. సేమ్ సినిమాలో కూడా అంతే అంటూ చెప్పుకొచ్చాడు ఆర్జీవీ.

ప్రతీ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి కానీ..

ఏదైనా కూర వండినప్పుడు ఆ కూరగాయ చూసి బాగాలేదు అని చెప్పడానికి.. ఆ కూర రుచి చూసి బాగాలేదు అని చెప్పడానికి చాలా తేడా ఉంటుందని లాజికల్ గా మాట్లాడారు. ప్రభుత్వం అంటే ప్రతీ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి కానీ.. సమస్యల్లోకి నెట్టోద్దు అంటూ చెప్పుకొచ్చాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటే.. కేవలం ఐదు నిమిషాల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కానీ హీరో నాని ఎదో అన్నాడని.. సిద్ధార్థ్ ఏదో అన్నాడని.. ఎవరికి వచ్చినట్లు వాళ్లు మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని అన్నాడు. అతడు మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.