Hero And Villians : వాళ్లు హీరోలే కానీ.. ఇక్కడ మాత్రం విలన్లు.. ఎందుకో ఇలా?
Hero And Villians : సీని పరిశ్రమలో ఒక దగ్గర క్యారెక్టర్ ఆర్టిగా చేశారంటే.. కొన్ని రోజుల తర్వాత అతడి యాక్టింగ్ స్కిల్ మంచిగా ఉంటే.. హీరో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ట్రెండ్ కొనసాగుతోంది.
తమిళం, మళయాళం, కన్నడలో సూపర్ స్టార్ హీరోలుగా..తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు తెలుగులో మాత్రం విలన్ అవతరాం ఎత్తుతున్నారు. దానికి గల కారణం తెలుగులో అక్కడ ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఇస్తుండటమే అనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇలా హీరో అవతరామెత్తి.. ఇటు విలన్ గా రాణిస్తున్న వాళ్లు ఎవరో ఓ సారి చూసేద్దాం..
అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో భారీ విజయం సాధించి ఉప్పెన సినిమా విలన్ గురించి చెప్పుకోవాలి. దీనిలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన విజయ్ సేతుపతి తమిళంలో పెద్ద హీరో. అక్కడ అతడు తీసే ప్రతీ సినిమా హిట్ గా నిలుస్తోంది. ఇలా అతడు తెలుగులో మాత్రం విలన్ అవతారమెత్తాడు.
ఇక రెండో స్థానంలో ఉన్న వ్యక్తి సుదీప్ . ఇతడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాలో విలన్ గా యాక్ట్ చేశాడు. కానీ కన్నడంలో సుదీప్ పెద్ద స్టార్. అంతే కాదు అతడి విజయ్ హీరోగా నటించిన పులి, సల్మాన్ హీరోగా నటించిన దబాంగ్ 3లో కూడా విలన్ అవతారమెత్తాడు.
రేసుగుర్రంలో హీరో పాత్రకు ఎంత ప్రాధన్యం ఉందో విలన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. అందులో బోజ్ పురికి చెందిన రవి కిషన్ విలన్ గా యాక్ట్ చేశాడు. బోజ్ పురిలో అతడు నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.
తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆర్య. ఇతడు కూడా అల్లు అర్జున్ సినిమా వరుడులో విలన్ అవతారమెత్తి.. మెప్పించాడు. తాజాగా మలయంలో స్టార్ హీరోగా ఉన్న ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో విలన్ గా నటించాడు. పుష్ప పార్ట్ 2లో ఇతడి పాత్ర ఎక్కువగా ఉండనుంది. తాజాగా కన్నడ దునియా విజయ్ కూడా విలన్ అవతారమెత్తాడు. నందమూరి బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా అధిక రెమ్యూనరేషన్ కోసం ఆశపడి వాళ్లు ఇలా.. విలన్ అవతారమెత్తుతున్నారనేది టాక్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…