Ramesh Reddy : ఏంటి అరుస్తున్నావ్ అని వెంకటేష్ గారు లోపలికి పిలిచి… బాలయ్య బాబుతో మొదటి సీన్ గొంతు పట్టుకుని చేయాలి : రమేష్ రెడ్డి

Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి ఉండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక నచ్చినా నచ్చకపోయినా సినిమా విషయంలో ఉన్నది ఉన్నట్లు చెప్పే రమేష్ రెడ్డి గారు దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు. ఇక నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ రెడ్డి గారు తొలి అనుభవాన్ని పంచుకున్నారు.

బాలయ్య తో మొదట సీన్ భయం వేసింది… వెంకటేష్ గారు అలా అరిచారు…

రవిరాజా గారి డైరెక్షన్ లో బాలయ్యబాబు సినిమా షూటింగ్ జరుగుతుంటే నక్సలైట్ పాత్ర చేయాల్సిన ఆర్టిస్ట్ దొరకలేదు. ఇక షూటింగ్ స్పాట్ లో అప్పటికి అప్పుడు నన్ను చేయమన్నారు డైరెక్టర్. ఆరు పేజీల భారీ డైలాగును చెప్పాలి అంటే రాసింది నువ్వే కదా చెప్పడానికి ఏంటి అంటూ నన్ను రెడీ అవ్వమని చెప్పారు. మొదటి సన్నివేశం కైకాల సత్యనారాయణ గారు బాలకృష్ణ గారి కాంబినేషన్ లో బాలయ్య బాబు గొంతు పట్టుకుని చెప్పే సీన్ భయం వేసింది కానీ మొదటి టేక్ లోనే చెప్పేసాను అందరూ మెచ్చుకున్నారు.

ఇక బాలయ్యబాబు నీకు మంచి టైమింగ్ ఉంది మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు నీలో అంటూ పొగిడారు. ఇక వెంకటేష్ గారి ‘శీను’ సినిమాకి డైలాగులు రాసాను ఆ సమయంలో రాజా రవీంద్ర నేను షూటింగ్ దగ్గర గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటే లోపల షూటింగ్ లో ఉన్న వెంకటేష్ గారు ఏంటి అంత గట్టిగా రమేష్ అరుస్తున్నాడు ఇక్కడికి వచ్చి ఆ డాక్టర్ వేషం వేయమను, అదేదో ఇక్కడొచ్చి అరవమను అంటూ అన్నారు అలా శీను లో కూడా నటించాను. ఇక బాలయ్యబాబు నన్ను గోపి ని కలిపి భలే ఉన్నారయ్య ఇద్దరూ తిరుపతి వెంకట కవుల లాగా అంటూ అనేవారు అంటూ అయన నటనా అనుభవాలు పంచుకున్నారు.