Relangi NarasimhaRao : నన్ను జూలో జంతువులా ఆడించారు… ఆయనకు దండం పెట్టి సినిమా చేయనని లెటర్ రాసి వచ్చేసా…: డైరెక్టర్ రేలంగి నరసింహారావు

Relangi NarasimhaRao : పాలకొల్లుకి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు.

జూలో జంతువులా ఆడించారు… నచ్చక వచ్చేసా…

ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దోడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి.

చలం గారితో సినిమా మొదలు పెట్టి మధ్యలోనే రేలంగి గారు తప్పుకున్నారు. దీనికి కారణాలు అడుగగా మొత్తం అన్ని పనులు ఆయనే చూసుకుంటారు డైరెక్టర్ అయినా కట్ చెప్పమన్నపుడు కట్ చెప్పాలి స్టార్ట్ చెప్పినపుడు స్టార్ట్ చెప్పాలి. ఆయన మనిషే మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మనిషే కెమెరా మాన్ అలా ఉంటారు, విగ్రహ చందంగా డైరెక్టర్ ఉంటాడు. ఆయన జూలో జంతువులను ఆడిస్తుంటే మనం అలా ఆడాలి. ఇది నచ్చక మూడో రోజే ఆయనకు చెప్పేసాను. నేను ఇలా చేయలేనని చెబితే నా గురించి తెలుసుకుని వచ్చుంటావు అనుకున్నాను అన్నారు. మీరే సినిమా చేయమని అడిగితే వచ్చా మీ మెంటాలిటీ నాకు తెలియదు నేను చేయలేను అని లెటర్ రాసి వచ్చేసాను అని చెప్పారు.