Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం గర్భిణీ అనే విషయం మనకు తెలిసిందే. మరికొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఉపాసన రాంచరణ్ వివాహం జరిగి సుమారు పది సంవత్సరాల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక మరికొద్ది రోజులలో మెగా కాంపౌండ్ లోకి బుల్లి వారసుడు లేదా వారసురాలు అడుగు పెట్టబోతున్నారు.
ఇలా ఉపాసన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈమె గురించి ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఉపాసన కూడా ఎప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కలిగే అనుభూతులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా తన బేబీ బంప్ ఫోటోలను కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకున్నటువంటి ఈమె సహజంగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మొదటిసారి తన భర్త రామ్ చరణ్ కు చెప్పినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాల గురించి కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనిపిస్తోంది అంటూ రామ్ చరణ్ కు చెప్పినప్పుడు తను మాత్రం చాలా కూల్ గా నువ్వు ఈ విషయం గురించి ఎగ్జైట్ అవ్వద్దు అని చెప్పారు.
చాలా ప్రశాంతంగా ఉండు మనం పరీక్షలు చేయించుకున్న తర్వాతే నిర్ధారించుకుందాం అని చాలా కూల్ గా సమాధానం చెప్పారు.నేను ఏ విషయం అయినా చాలా తొందరపడి చెప్పేస్తాను కానీ రామ్ చరణ్ అలా కాదు చాలా కూల్ గా ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడుతారు అందుకే తనంటే నాకు చాలా ఇష్టం నేను ఇప్పుడు ఇలా సంతోషంగా ఉన్నాను అంటే అందుకు కారణం చరణ్ అంటూ ఈ సందర్భంగా ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…