Adipurush: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి కృతి సనన్ ఇందులో హీరోయిన్ గా నటించారు. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్ నటించిన సీత పాత్రలో కృతి సనన్ నటించారు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఎక్కడైతే రామ పారాయణం జరుగుతుందో అక్కడికి హనుమంతుడు వస్తారని మన హిందువులు భావిస్తారు.
ఇలా హనుమంతుడు వస్తారన్న భావనతోనే ప్రతి ఒక్క థియేటర్లోనూ ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయించాలని డైరెక్టర్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క థియేటర్లో డైరెక్టర్ సూచనల మేరకు హనుమంతుడి కోసం సీటును కేటాయించారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రసారమవుతున్న చోట హనుమంతుడి కోసం ఒక సీటును ఏర్పాటు చేశారు.
ఇలా హనుమంతుడి కోసం సీటు కేటాయించడంతో ఈ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరూ పెద్ద ఎత్తున ఈ సీటులో హనుమంతుడు చిత్రపటాన్ని పెట్టడమే కాకుండా ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించి పూజలు చేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…