Analyst Damu Balaji : సరూర్ నగర్ లో మ్యాన్ హోల్ హత్యగా బాగా హాట్ టాపిక్ అయిన అప్సర అనే యువతి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి సూర్య వెంకట సాయి కృష్ణ పూజారి అంటూ ఇప్పటివరకు అనుకున్నారు. నిజానికి అతను గుడిలో అర్చకుడు కాదు. కేవలం గుడి మేనేజ్మెంట్ కి సంబందించిన పనులను చూసుకుంటూ తన స్వంతానికి పూజలు జరిపేవాడు అంటూ తాజాగా వినిపిస్తోంది. సాయికృష్ణ గురించి ఆసక్తికర విషయాలను మైసమ్మ గుడిలో అర్చకులుగా పనిచేస్తున్న వాళ్లు చెబుతున్నారు. ఇక ఆ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
సాయికృష్ణ పూజారి కాదు…
సాయికృష్ణ తొలుత వేరే దేవాలయాల్లో పనిచేస్తున్న సమయంలో అక్కడ డబ్బును తప్పు దారిపట్టించాడు అనే ఆరోపణలతో అక్కడి నుండి పంపించేసారని ఇక ఆ సమయంలోనే చిన్న గుడిగా ఉన్న మైసమ్మ గుడికి ఆలయ కమిటీ మెంబెర్ గా ఉంటూ అక్కడ గుడిలో అర్చకులను అలాగే సెక్యూరిటీ సిబ్బందిని మొదలుకొని అందరినీ సాయికృష్ణ నే నియమించి గుడి మేనేజ్మెంట్ చూసుకునేవాడని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.
ఇక హత్య చేసిన తరువాత గుడి వెనుక మండల్ ఆఫీస్ స్థలంలో శవాన్ని మ్యాన్ హోల్ లో పడేయాలని అనుకున్నపుడు మొదట గుడి వాచ్ మెన్ ను పనిలో నుండి తీసేసాడు అంటూ బాలాజీ తెలిపారు. మొదటి నుండి ఈ కేసులో అర్చకుడిగా సాయికృష్ణ ని అందరూ భావించినా అతను అర్చకుడు కాదని గుడి కమిటీలో ఉంటూ అక్కడ నిత్యాన్నదానం వంటి పనులను చేయిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. అతను గుడికి వచ్చే విరాళాలను సొంతానికి వాడుకొన్నాడనే ఆరోపణలు ఉన్నాయని బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…