Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

Smoking: దేశంలో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వస్తాయి అనుకున్నారు… కానీ ఇప్పుడు పాతికేళ్ళలోపు ఉండే యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 2015లో భారతదేశంలో దాదాపు 6 కోట్ల 20 లక్షల మందికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని గుర్తించారు.

Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!
Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

వారిలో రెండు కోట్ల 30 లక్షల మంది వయసు కేవలం 40 ఏళ్ల లోపు అని సర్వే తేల్చింది. ఈ గణాంకాలను చూస్తే గుండె జబ్బులు పెరుగుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ధూమపానం కారణం అవుతున్నాయి.  ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తి ధూమపానానికి ఏడాది పాటు దూరంగా ఉంటే గుండె జబ్బులు వచ్చే తీవ్రత దాదాపు సగానికి పడిపోతుంది.

Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!

ధూమపానం చేసే వారిని.. చేయని వారిలో పోలిస్తే కరొనరి ఆర్టెరీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15 శాతం మంది గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయి.

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా..

ఇదొక్కటే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డ కట్టడం, కాళ్లలో ధమనుల వాపు వంటివి గమనిస్తున్నాం. సిగరెట్ తాగడం వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ను తీసుకెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీనివల్లనే గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెకు రక్షణ ఇవ్వాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వ్యసనాలను దూరంగా పెట్టుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధుల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. సాల్మాన్, టూ నా, మాకెరెల్ చేపలు ఇతర సముద్ర చేపలను తరచుగా తినాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. గుండె ధమనుల్లో వాపు రాకుండా చేయాలంటే బాదం, వాల్నట్, కిస్మిస్ జీడిపప్పు ,ఖర్జూరాలు వంటివి రోజు తీసుకోవాలి. గుండెకు మేలు చేసే క్యారెట్లు, చిలగడదుంపలు అధికంగా తీసుకోవాలి. మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానేయాలి.