Smoking: ధూమపానంతో పెరిగిపోతున్న గుండె జబ్బులు..! అధికారులు ఏమంటున్నారంటే..!
Smoking: దేశంలో గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వస్తాయి అనుకున్నారు… కానీ ఇప్పుడు పాతికేళ్ళలోపు ఉండే యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. 2015లో భారతదేశంలో దాదాపు 6 కోట్ల 20 లక్షల మందికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని గుర్తించారు.
వారిలో రెండు కోట్ల 30 లక్షల మంది వయసు కేవలం 40 ఏళ్ల లోపు అని సర్వే తేల్చింది. ఈ గణాంకాలను చూస్తే గుండె జబ్బులు పెరుగుతున్నాయి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, ధూమపానం కారణం అవుతున్నాయి. ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తి ధూమపానానికి ఏడాది పాటు దూరంగా ఉంటే గుండె జబ్బులు వచ్చే తీవ్రత దాదాపు సగానికి పడిపోతుంది.
ధూమపానం చేసే వారిని.. చేయని వారిలో పోలిస్తే కరొనరి ఆర్టెరీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. సిగరెట్ తాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 15 శాతం మంది గుండె సంబంధిత మరణాలు సంభవిస్తున్నాయి.
ఇదొక్కటే కాకుండా బ్రెయిన్ స్ట్రోక్, రక్తం గడ్డ కట్టడం, కాళ్లలో ధమనుల వాపు వంటివి గమనిస్తున్నాం. సిగరెట్ తాగడం వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ను తీసుకెళ్లే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీనివల్లనే గుండెపోటు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. గుండెకు రక్షణ ఇవ్వాలంటే మన ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు వ్యసనాలను దూరంగా పెట్టుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల గుండె సంబంధ వ్యాధుల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. సాల్మాన్, టూ నా, మాకెరెల్ చేపలు ఇతర సముద్ర చేపలను తరచుగా తినాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి చాలా అవసరం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. గుండె ధమనుల్లో వాపు రాకుండా చేయాలంటే బాదం, వాల్నట్, కిస్మిస్ జీడిపప్పు ,ఖర్జూరాలు వంటివి రోజు తీసుకోవాలి. గుండెకు మేలు చేసే క్యారెట్లు, చిలగడదుంపలు అధికంగా తీసుకోవాలి. మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానేయాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…