Samantha: ‘ఏ మాయ చేశావే’ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇండస్ట్రీని మాయ చేసింది. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా మారింది. వరసగా ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్ తో పాటే కాకుండా కోలీవుడ్ లో కూడా తలపతి విజయ్, సూర్య, శివకార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
విడాకులు తీసుకున్న తరువాత తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది.విడాకుల అనంతరం నుంచి సమంత మరింత జోరుగా సినిమాలు చేస్తోంది. సమంత చేసిని ఊ అంటావా మావా.. ఊఊ అంటావా పాట రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప సినిమా విడుదల కాకముందే పాట పెద్ద సక్సెస్ అయింది.
సమంత గ్లామర్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ కలిసి దేశ వ్యాప్తంగా ఈ ఐటెం సాంగ్ మారుమోగింది. ప్రస్తుతం ఈ సినిమా తరువాత వరసపెట్టి సినిమాలకు కమిట్ అవుతోంది. గుణ శేఖర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమా ‘ శాకుంతం’ చేస్తోంది. దీంతో పాటు తెలుగు- తమిళ భాషల్లో ‘యశోద’ సినిమాను కూడా చేస్తోంది. ఇధిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా మరో సినిమా చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సమంత తన జీవితంలో ఉన్న చీకటి కోణం గురించి వెళ్లడించింది. కేవలం రూ. 500 కూడా పని చేశానని చెప్పుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీకి రాకముందు తను ఎదురుకున్న కష్టాలను గురించి ఓ కార్యక్రమంలో వెల్లడించింది. పెద్దపెద్ద వారి ఫంక్షన్లకు గెస్ట్ లను ఆహ్వానించే అమ్మాయిగా పని చేశానంది. కేవలం ఒక పూట భోజనంలో రెండు నెలలు గడపానని గుర్తు చేసుకుంది. డబ్బులు లేక చదువు మానేశానని వెల్లడించింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేద్దాం అనుకుంటే… నీకిది అవసరమా అంటూ.. కుటుంబ సభ్యులు వెనక్కి లాగే ప్రయత్నాలు చేశారని తెలిపింది
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…