Sai Chand Driver : అర్ధరాత్రి 12 గంటలకు గుండెపోటు… సాయి చంద్ అక్కడే మరణించినా చెప్పలేదు… చివరగా మాట్లాడింది అదే…: సాయి చంద్ డ్రైవర్

Sai Chand Driver : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమ వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తు ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు.

చివరగా చెప్పింది ఇదే…

సాయి చంద్ తన కుటుంబంతో కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లగా రాత్రి సమయంలో గుండె పోటు రావడం వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయన కార్డియాక్ అరెస్టు అవడంతో మరణించారు. ఇక ఆయన గురించి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ ఆయన గురించి మాట్లాడుతూ ఇంకొన్ని రోజులకు ఎన్నికలు రాబోతుండటం వల్ల బాగా బిజీగా ఉంటాను. ఇప్పటికే సభలు అంటూ బిజీ అయి పోయాను. కుటుంబంతో సమయాన్ని గడపలేక పోతున్నాను. అందుకే ఈరోజు వాళ్ళతో ఫామ్ హౌస్ లో ఉండి రేపు ఆసిఫాబాద్ సభకి వెళదాం అని చెప్పారు.

కానీ ఆరోజు రాత్రే ఇలా జరిగింది. ఎప్పుడూ అనారోగ్యంగా ఉందని చెప్పలేదు. చాలా ఫిట్ గా ఉండేవారు. తినే ఆహరం విషయంలో కూడా బాగా జాగ్రత్త తీసుకుంటారు. అయితే కరోనా సమయంలో ఇబ్బంది పడ్డారు. అంతే కానీ ఇంకెప్పుడూ ఆయన బాగోలేదని కంప్లైన్ట్ లేదు. రాత్రి 12 గంటల సమయంలో వదిన బయటికి వచ్చి ఫిట్స్ వస్తున్నాయి హాస్పిటల్ కి పోదాం అన్నారు. వెంటనే లోకల్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. అప్పటికే ఆయన మరణించారని అనుచరులకు అనుమానం వచ్చింది. కానీ చెబితే వదిన తట్టుకోలేదని చెప్పలేదు. కేర్ హాస్పిటల్ కి ఇంకా ఎక్కడైనా హోప్ ఉందనే వెళ్ళాం అక్కడికి వెళ్ళాక వదినకు చెప్పాల్సి వచ్చింది అంటూ సాయి చంద్ మరణం గురించి ఆయన డ్రైవర్ తెలిపారు.