Samantha: అది నన్ను తీవ్రంగా హర్ట్ చేసింది.. ఆవేదనలో సమంత !

Samantha: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పుష్పలో తను చేసిన ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ సంచలనాలను క్రియేట్ చేసింది. విడాకులు తర్వాత.. సమంత చేస్తున్న ఐటెం సాంగ్ కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

Samantha: తీవ్ర ఆవేదనలో సమంత..అంతలా బాధ పెట్టించిన న్యూస్ ఎంటి అంటే..!

దీంతో డీఎస్పీ మ్యూజిక్, సమంత డ్యాన్స్ కలిసి సాంగ్ ను పెద్ద హిట్ చేశాయి. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లభించాయి.  మరోవైపు వరసగా సినిమాలు చేస్తోంది సమంత. గుణశేఖర్ డైరెక్షన్ లో పౌరానిక సినిమాగా ‘ శాకుంతలం’ వస్తోంది. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రాబోతోంది.

Samantha: తీవ్ర ఆవేదనలో సమంత..అంతలా బాధ పెట్టించిన న్యూస్ ఎంటి అంటే..!

దీంతో పాటు తెలుగు, తమిళం భాషల్లో ‘ యశోధ’ సినిమాను చేస్తోంది సమంత. ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా ఇటీవల ప్రారంభం అయింది.  ఈ విధంగా వరస సినిమాలతో జోష్ లో ఉన్న సమంతను ఓ విషయం మాత్రం చాలా బాధిస్తోంది. ఇప్పుడంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు సర్వసాధారణం అయిపోయాయి.

ఆ ఫోన్లకు ఉండే క్రేజ్ వేరు..

2000 సంవత్సరంలో ‘బ్లాక్ బెర్రి’ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. స్టేటస్ సింబల్ గా బ్లాక్ బెర్రీ ఫోన్లను వాడే వారు. సెలెబ్రిటీలు, ధనవంతులు, బిజినెస్ మ్యాన్స్ ఎక్కువగా బ్లాక్ బెర్రీ ఫోన్స్ నే ఉపయోగించేవారు. అయితే అలాంటి బ్లాక్ బెర్రీ ఫోన్లు జనవరి 4 నుంచి మూగ బోయాయి. ఈ సర్వీసులను నిలిపిేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్లాక్ బెర్రీ శకం ముగిసింది. అయితే ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘ఎందుకో తెలియదు.. ఈ వార్త నన్ను బాధిస్తోంది’ అంటూ సామ్ కామెంట్ పెట్టింది. సమంత ఒక్కరే కాదు. చాలా మంది బ్లాక్ బెర్రీ ప్రియులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.