Samantha: నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే పుష్పలో తను చేసిన ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ ఐటెం సాంగ్ సంచలనాలను క్రియేట్ చేసింది. విడాకులు తర్వాత.. సమంత చేస్తున్న ఐటెం సాంగ్ కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
దీంతో డీఎస్పీ మ్యూజిక్, సమంత డ్యాన్స్ కలిసి సాంగ్ ను పెద్ద హిట్ చేశాయి. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లభించాయి. మరోవైపు వరసగా సినిమాలు చేస్తోంది సమంత. గుణశేఖర్ డైరెక్షన్ లో పౌరానిక సినిమాగా ‘ శాకుంతలం’ వస్తోంది. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రాబోతోంది.
దీంతో పాటు తెలుగు, తమిళం భాషల్లో ‘ యశోధ’ సినిమాను చేస్తోంది సమంత. ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా ఇటీవల ప్రారంభం అయింది. ఈ విధంగా వరస సినిమాలతో జోష్ లో ఉన్న సమంతను ఓ విషయం మాత్రం చాలా బాధిస్తోంది. ఇప్పుడంటే అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు సర్వసాధారణం అయిపోయాయి.
2000 సంవత్సరంలో ‘బ్లాక్ బెర్రి’ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. స్టేటస్ సింబల్ గా బ్లాక్ బెర్రీ ఫోన్లను వాడే వారు. సెలెబ్రిటీలు, ధనవంతులు, బిజినెస్ మ్యాన్స్ ఎక్కువగా బ్లాక్ బెర్రీ ఫోన్స్ నే ఉపయోగించేవారు. అయితే అలాంటి బ్లాక్ బెర్రీ ఫోన్లు జనవరి 4 నుంచి మూగ బోయాయి. ఈ సర్వీసులను నిలిపిేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్లాక్ బెర్రీ శకం ముగిసింది. అయితే ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘ఎందుకో తెలియదు.. ఈ వార్త నన్ను బాధిస్తోంది’ అంటూ సామ్ కామెంట్ పెట్టింది. సమంత ఒక్కరే కాదు. చాలా మంది బ్లాక్ బెర్రీ ప్రియులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…