విడాకుల తర్వాత సంచలనమైన పోస్ట్ చేసిన సమంత నైతికత ఉంటే వారిని కూడా ప్రశ్నించాలి..?

అక్టోబర్ 2 న సమంత, నాగచైతన్య విడాకుల గురించి ప్రకటన చేసిన తర్వాత ఎక్కడ చూసిన సమంత, నాగచైతన్య టాపిక్ మాత్రమే నడుస్తోంది. ఏడేళ్ళు ప్రేమించుకుని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకుని వివాహం చేసుకుని ఒకటయ్యారు సామ్, చైతూ.. కానీ అనుహ్యాంగా తాము విడాకులు తీసుకున్నట్లుగా సామ్, చైతూ ప్రకటించడంతో సినీ ప్రముఖులతోపాటు.. అభిమానులు సైతం షాకయ్యారు.

ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు ఇలా ఆకస్మాత్తుగా విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటీ అనేది మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. అయితే తాము విడిపోవడానికి కారణాలు సమంత, చైతన్య చెప్పకపోయినా.. నెట్టింట్లో వారిపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఎవరికి నచ్చినట్లుగా వారు సమంత, నాగచైతన్య విడాకులకు గల కారణాలను అంచనాలు వేసేస్తున్నారు.

అందులో ఏది నిజమో.. అబద్దమో తెలియదు. ఇదిలా ఉంటే.. తాజాగా తన సోషల్ మీడియాలో స్టేటస్ రూపంలో ఇలా పోస్ట్ చేశారు. “మహిళల నైతికత” గురించి ప్రస్తావించే ఫరీదా.డి కి సంబంధించి ఓ కోట్ ను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అందేంటంటే..‘‘ స్త్రీలు ఏ పని చేసినా ఆ విషయాలు ప్రశ్నార్థకంగా మారినప్పుడు.. పురుషులు చేసినప్పుడు కూడా ప్రశ్నించాలి.. లేదంటే.. ప్రాథమికంగా సమాజానికి నైతికత లేదనే చెప్పాలి’’ అంటూ ఆమె ఆ కొటెషన్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దీనిపై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. విడాకుల తర్వాత ఆమె ఇటువంటి సందేశాన్ని పంచుకోవడం మొదటిసారి. సమంత చేసిన ఈ పోస్టుకు ఆమె డిజైనర్ ప్రీతమ్ స్పందిస్తూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు. విడాకుల తర్వాత సమంత ఈ విధంగా స్పందించడంతో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.