బ్రేకింగ్ న్యూస్.. ఆ యూట్యూబ్ ఛానళ్లపై సమంత కేసు..!

సమంత అక్టోబర్ 2 న తన భార్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమెను సోషల్ మీడియాలో, ఇటు టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ చానళ్లలో కూడా ఇష్టం వచ్చిన కథనాలు రాస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ ప్రచురితం చేస్తున్నారు.

దీంతో ఇటువంటి చర్యలపై సమంత సీరియస్ అయ్యారు. వీటిపై ఆమె కోర్టు మెట్లు ఎక్కారు.తన పరువుకు భంగం వాటిళ్లేవిధంగా వీడియో కథనాలు ప్రసారం చేసిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. వాటిలో ముఖ్యంగా సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ, టాప్ తెలుగు టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై పిటిషన్‌ దాఖలు చేశారు.

సోషల్‌ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ.. కథనాలు రాశారని.. అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సమంత తరుపున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది ఈ కేసును వాదించనున్నారు. ఈ రోజు సాయంత్రం బాలాజీ తమ వాదనను వినిపించనున్నారు. విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారని.. ఇటువంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.