సమంత అక్టోబర్ 2 న తన భార్త నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఆమెను సోషల్ మీడియాలో, ఇటు టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ చానళ్లలో కూడా ఇష్టం వచ్చిన కథనాలు రాస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ ప్రచురితం చేస్తున్నారు.
దీంతో ఇటువంటి చర్యలపై సమంత సీరియస్ అయ్యారు. వీటిపై ఆమె కోర్టు మెట్లు ఎక్కారు.తన పరువుకు భంగం వాటిళ్లేవిధంగా వీడియో కథనాలు ప్రసారం చేసిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. వాటిలో ముఖ్యంగా సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీతోపాటు సీఎల్ వెంకట్రావుపై పిటిషన్ దాఖలు చేశారు.
సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తూ తనని కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లి కోర్టుని ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుని కోరారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ.. కథనాలు రాశారని.. అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సమంత తరుపున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది ఈ కేసును వాదించనున్నారు. ఈ రోజు సాయంత్రం బాలాజీ తమ వాదనను వినిపించనున్నారు. విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తున్నారని.. ఇటువంటి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…