Samantha: తనని చూస్తూ అలా ఉండిపోయాను.. చైతన్య హీరోయిన్ పై సమంత కామెంట్స్!

Samantha: సినీనటి సమంత అనారోగ్య సమస్యల బారిన పడటంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత గత కొద్దిరోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా సమంత మరో నటి సాయి పల్లవి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సమంతకు సాయి పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపారు. గతంలో ఆమె ఒక షోలో పెర్ఫార్మెన్స్ చేస్తున్న సమయంలో ఆ కార్యక్రమానికి తాను జడ్జిగా వెళ్లానని సమంత తెలిపారు.

స్టేజ్ మీద సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఉంటే తనని అలా చూస్తూ ఉండిపోయానని కల్లార్పకుండా తన డాన్స్ చూస్తున్నానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా సాయి పల్లవి గురించి సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సాయి పల్లవి నాగచైతన్య కలిసి ఇదివరకే లవ్ స్టోరీ సినిమాలో నటించారు. త్వరలోనే తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తండేల్…

లవ్ స్టోరీతో హిట్ కొట్టినటువంటి నాగచైతన్య తదుపరి మరో హిట్ సినిమాని అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే మరోసారి సాయి పల్లవితో కలిసి ఈయన నటిస్తున్నటువంటి తరుణంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.