Movie News

Jr.NTR: ఎన్టీఆర్ తలుచుకుంటే రాత్రికి రాత్రి టిడిపి సమాధి.. వర్మ షాకింగ్ కామెంట్స్?

Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ దర్శకుడిగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా బయోపిక్ సినిమాల వెంట పడుతున్నారు. దీనితో ఈయన సినిమాలన్నీ పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసిందే

ఇకపోతే త్వరలోనే వ్యూహం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వేడిని పెంచడానికి ఈయన వ్యూహం సినిమాని చేసి దానిని ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ కి ఇష్టం లేక రాజకీయాలకు దూరంగా ఉన్నారా లేక టిడిపి పార్టీ తనని దూరం పెట్టిందనే విషయం తనకు తెలియదని తెలిపారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్నంత క్రేజ్ ఉందని తెలిపారు.

భయపడుతున్నారా..

జూనియర్ ఎన్టీఆర్ కనుక తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఒక్క మాట చెబితే రాత్రికి రాత్రి తెలుగుదేశం పార్టీ సమాధి అవుతుందని లోకేష్ చంద్రబాబు నాయుడు వంటి వారందరూ కూడా ఫినిష్ అవుతారని వర్మ తెలిపారు. ఆ భయం వారిలో ఉందని, అందుకే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పట్ల ద్వేషం పెంచుకొని తనని దూరం పెడుతున్నారు అంటూ వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago