Sarojini Devi : మురళి మోహన్ గారు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు పిలుస్తున్నారు అని చెప్పారు… నాతో మూడు గంటలు మాట్లాడారు : సరోజినీ దేవి

Sarojini Devi : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ఎన్నోసార్లు కేసులో వెనక్కి తగ్గాలని భయపెడుతూ ఫోన్స్ వచ్చాయంటూ చెప్పిన సరోజినీ గారు అప్పటి విషయాలను చెప్పారు.

చంద్రబాబు నాయుడు దాదాపు మూడు గంటలు మాట్లాడారు…

ప్రత్యూష మరణం సమయంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. ప్రత్యూష మృతిపై పలు సందేహాలు ఉండడంతో కేసు తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ సరోజినీ దేవి గారు పలుమార్లు ఆరోపించారు. ఇక అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, నటుడు రాజకీయానాయకుడు అయిన మురళి మోహన్ ద్వారా సరోజినీ గారిని పిలిపించారట. దాదాపు మూడు గంటలసేపు సరోజినీ దేవి గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు.

చంద్రబాబు ఇంకేమైనా కావాలంటే అడగండి అని చెప్పినా సరోజినీ గారు కేవలం న్యాయం చేయండి, నేను నా కొడుకును పెంచగలను నాకు ఉద్యోగం ఉంది కానీ నా కూతురు మృతికి నాకు న్యాయం కావాలి అని అడిగారట. ఇక ప్రత్యూష దహన సంస్కారాలు ముగిసి తిరిగి భువనగిరి నుండి హైదరాబాద్ వచ్చేసరికి సాక్ష్యాధారాలను తారుమారు చేశారంటూ సరోజినీ దేవి చెప్పారు.