Featured

Mamatha Mohan Das : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దమ్మున్న మగాడు ఆ హీరో మాత్రమే : మమతా మోహన్ దాస్

Mamatha Mohan Das : ‘రాఖీ రాఖీ’ పాటతో సింగర్ గా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న మళయాళి భామ మమత మోహన్ దాస్. తెలుగులో యామదొంగ, కింగ్, కేడి, చింతకాయల రవి వంటి సినిమాల్లో మెరిసిన ఈ భామ మలయాళంలో ఎక్కువ సినిమాలను చేసి అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అనుకోకుండా అనారోగ్యం బారిన పడి సినిమాలకు దూరమై మళ్ళీ తిరిగి కోలుకున్నాక సినిమాల్లో నటిస్తూ బిజీ అయిన మమతా మోహన్ దాస్ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోను తెగ పొగిడేస్తోంది. ఆ హీరో మాత్రమే రియల్ హీరో అంటూ ప్రశంసిస్తోంది.

ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్న మమతా…

అనారోగ్యం నుండి కోలుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తున్న మమత ను గుర్తుపెట్టుకుని ఎన్టీఆర్ ఫోన్ చేసి మరీ బాగోగులు అడిగాడట. చేసింది ఒక్క సినిమానే అయినా తాను నన్ను గుర్తు పెట్టుకుని ఫోన్ చేసి నా బాగోగులు అడిగారు, నాతో కలిసి పనిచేసిన ఏ హీరో నా ఆరోగ్యం ఎలా ఉందంటూ పలకరించలేదు. నేను చాలా మంది హీరోలతో చేశాను, కానీ ఎవరూ నన్ను అలా గుర్తు పెట్టుకొని మాట్లాడించలేదని చెప్తూ ఎమోషనల్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ రియల్ హీరో అంటూ ప్రశంసిస్తోంది, తెలుగు ఇండస్ట్రీలో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడంటూ ఆల్రడీ చిన్న ఎన్టీఆర్ కు మంచి పేరుంది, కోటా వంటి సీనియర్ నటులు సైతం ఈ తరం లో సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ లాంటోడు ఉండాలి అంటూ ఓపెన్ కామెంట్స్ చేసారు. ఇక మమత మాటలతో అది మరోసారి రుజువయింది. దీంతో నందమూరి అభిమానులు మా ఎన్టీఆర్ రియల్ హీరో, టాలీవుడ్ లో ఒక్క మగాడు అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago