C. Kalyan : చాలా ఏళ్ల నుండి సినిమా రంగంలో ఉంటూ సినిమాలను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి సికే ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మించారు. సినిమా నిర్మాణం మాత్రమే కాకుండా సి కళ్యాణ్ వ్యాపారాలు చేస్తూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఆయన పలు ఇంటర్వ్యూల్లో సినిమాల గురించి తెర వెనుక సంగతులను చెబుతుంటారు. ఇక రామ్ గోపాల్ వర్మ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో ఆసక్తికర వాఖ్యలు చేసారు సి కళ్యాణ్.
పెగ్గు వేస్తే వర్మ మాట్లాడేది అదే…
వర్మ తో కలిసి మందు తాగేవాడిని అంటూ సి కళ్యాణ్ చెబుతూ వర్మ మంచి టెక్నీషియన్ అంటూ చెబుతూ రోజు ఒకేలాగా వర్మ జీవిస్తాడు ఉదయం వోడ్కాతో మొదలవుతుంది. కానీ ఎంత తాగినా చుట్టూ ఎవరున్నా తాను మాట్లాడే విషయాలు మాత్రం సినిమా గురించే. సినిమా గురించి తప్ప వేరే విషయాలు వర్మ మాట్లాడడు, అది తాగినపుడు అయినా తాగనప్పుడైనా సినిమా తప్ప వేరే మాట్లాడడు. తాను ఒక మంచి క్రియేటర్, మంచి సినిమా తీయగలడు కానీ ఈ మధ్య కాలంలో ట్రాక్ తప్పాడు అంటూ వర్మ గురించి ఆయన అభిప్రాయాలను చెప్పారు, వర్మ మంచి వ్యక్తి అంటూ కితబిచ్చారు సి కళ్యాణ్.
ఇక తాను సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వివాదాల నడుమ విడుదల ఆగిపోయినపుడు, ఫైనాన్స్ లేక ఆగిపోయినపుడు నేనే పంచాయతీ చేశాను. ‘సమరసింహారెడ్డి’ సినిమా వివాదంను సర్దుబాటు చేసి విడుదల చేయించాను. ఇక చిరంజీవి ‘అంజి’ సినిమాల విడుదల సమయంలో పంచాయతీ చేశానంటూ చెప్పారు. ఇలా ఎన్నో సార్లు పంచాయితీ చేసాను కానీ ఎప్పుడూ డబ్బు కానీ ఇతర ఫేవర్స్ కానీ చేయించుకోలేదు. అలా పంచాయతీ చేసినపుడు నా డబ్బే పోగొట్టుకున్నాను కానీ ఇతరులతో డబ్బు తీసుకోలేదు అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…