Sekhar Master: విషాదంలో శేఖర్ మాస్టర్ కుటుంబం… జీర్ణించుకోలేకపోతున్నానంటూ పోస్ట్!

Sekhar Master: కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ సినిమాలకు పని చేస్తూ ఎంతో బిజీ అయ్యారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ వీడియోలు చేసుకుంటూ ఉండడమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ గా కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొంటూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను షేర్ చేసే ఈయన తాజాగా తన ఇంట్లో జరిగిన విషాద ఘటనను తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

శేఖర్ మాస్టర్ వదిన మరణించారనే విషయాన్ని ఈయన వెల్లడించారు. తన వదిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి శేఖర్ మాస్టర్వ దిన మిస్ యూ.. వదిన.. ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావ్.. పాజిటివిటీని పెంచావు

ఆత్మకు శాంతి కలగాలి..
నువ్వు లేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతోన్నాము.. ఇప్పుడైనా మంచి ప్రదేశంలోకి వెళ్లి ఉంటావని భావిస్తున్నాము నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిన ఎప్పుడు మాతోనే ఉంటావు మీ ఆత్మకు శాంతి చేకూరాలి వదిన అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది అయితే ఆమె ఎందుకు మరణించింది అనే విషయాలను మాత్రం శేఖర్ మాస్టర్ వెల్లడించలేదు.

https://www.instagram.com/p/C50Pw6luXZM/?utm_source=ig_embed&ig_rid=8c0bf66a-536b-4039-8411-0419c96b6492