Senior Actor Narasimharaju : చనిపోయే ముందు దాసరి గారు పడిన కష్టాలు… దాసరి గారి ఆస్తులన్నీ… కెనడా లో నాకున్న ఆస్తులు ఇవే : సీనియర్ నటుడు నరసింహారాజు

Senior Actor Narasimharaju : నాగేశ్వరావు గారిని చూసి సినిమాలలోకి రావాలనే కోరికతో చదువు మధ్యలో ఆపేసి మద్రాస్ వచ్చిన నరసింహారాజు గారు మొదట కన్నడ సినిమాలో మంచి అవకాశం దక్కించుకుని అక్కడ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత తెలుగులో తూర్పు పడమర, నీడలేని ఆడది అంటూ వరుసగా సినిమాల్లో హిట్లు కొట్టారు. ఇక విఠలాచర్య గారి సినిమాలనగానే నరసింహారాజు గారు గుర్తొస్తారు. ఆయనతో చాలా సినిమాలు చేసిన నరసింహారాజు గారు ఆయన తరువాత దాసరిగారి తో మూడు సినిమాలను చేసారు. ఒకరకంగా సాంఘిక సినిమాల్లో ఆయనను నిలబెట్టింది దాసరి గారే. అందుకే ఆయనను గురువుగా భావిస్తారు నరసింహారాజు గారు.

దాసరి గారి ఆస్తులను చూసుకునే వాడిని…

దాసరి గారితో మూడు సినిమాలను చేసిన నరసింహారాజు గారు సాంఘిక చిత్రాలతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆయనకు సన్నిహితంగా ఉండటంతో దాసరి గారు ఆయనకు సంబంధిచిన ఒక బిల్డింగ్ లాస్ లో ఉండడంతో చూసుకోమని చెప్పడంతో అక్కడే ఉండి ఆ బిల్డింగ్ ను ఒక చిన్న రిసార్ట్ లాగా మార్పులు చేసి మద్రాస్ నుండి షూటింగ్స్ కి వచ్చేవాళ్లకు ఇచ్చేవాడిని, అలా లాస్ లో ఉన్న బిల్డింగ్ కి దాదాపు రోజుకి నలభై నుండి యాభై వేలు ఆదాయం వచ్చేలా చేసాను. ఇక నాకు రోజుకి ఐదువేలు వచ్చేది దీంతో సినిమాలలో కంటే ఇదే బాగుందని దాసరి గారు ఏదైనా వేషం ఇచ్చినా ఇదే బాగుందండి వ్యాపారం చూసుకుంటా అని చెప్పేవాడిని అంటూ నరసింహారాజు గారు చెప్పారు. అయితే దాసరి గారితో చిన్న క్లాష్ వల్ల ఆయన నీకు వేషాలు ఇవ్వను అనేసరికి నేను మిమ్మల్ని అడగను అని చెప్పి వచ్చేసాను. కేవలం ఆయనతో మూడు సినిమాలనే చేసాను ఆ తరువాత నటించలేదు.

ఆయన చివరి రోజుల్లో కూడా ఆయన దగ్గరలేను. పద్మ గారు దాసరి గారు ఇద్దరూ లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో మూడో వ్యక్తి వల్ల గొడవలు వచ్చాయి. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, నాకు పెద్దగా తెలియకపోయినా ఆయన పోగొట్టుకోలేదని అనుకుంటున్నా అంటూ దాసరి గారితో ఉన్న అనుబంధాన్ని చెప్పారు. ఇక నరసింహారాజు గారి కొడుకు కోడలు కెనడా లో స్థిరపడటం వాళ్ళ అక్కడే రెండు పాలస్ లు కొన్నామని అక్కడ ల్యాండ్ ఇక్కడికంటే తక్కువ రేట్ ఉంటుందంటూ చెప్పారు. రెండు కోట్లంటే అక్కడ పెద్ద భవంతి కొనుక్కోవచ్చని చెప్పారు. పెద్దగా ఆస్తులేమీ లేవంటూ నరసింహారాజు గారు క్లారిటీ ఇచ్చారు.