Ramanaidu Studio: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఏదో ఒక విషయంపై హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటాయి. అధికార పక్షం ప్రతిపక్షం మధ్య ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. ప్రస్తుతం మూడు రాజధానుల విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతకగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామానాయుడు గారు విశాఖపట్నంలో కూడా ఓ స్టూడియో నిర్మించాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే నగరం నడిబొడ్డున ఓ విశాలవంతమైన స్థలాన్ని భారీ ధరలకు కొనుగోలు చేశారు. అయితే తన తండ్రి కలను ఎలాగైనా నెరవేర్చాలని సురేష్ బాబు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు ఈయన వెల్లడించారు.
విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణం కోసం కేటాయించిన స్థలం పై సీఎం జగన్ భార్య భారతి కన్ను పడటంతో భార్య కోరిక మేరకు జగన్ సురేష్ బాబుని పిలిపించి బెదిరించి మరి బలవంతంగా కాగితాలపై సంతకం పెట్టించుకుని ఆ భూమిని కబ్జా చేశారంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సురేష్ బాబు స్వయంగా నాతో చర్చించాడని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
ఈ భూమి కబ్జా విషయంపై సురేష్ బాబు తనతో మాట్లాడుతూ బెదిరించి మరి సంతకం పెట్టమన్నారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నేను సంతకం పెట్టానని సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారంటూ మాజీ మంత్రి మీడియా సమావేశంలో భాగంగా తెలియజేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపై నిర్మాత సురేష్ బాబు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…