Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా వ్యాఖ్యతగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతోనూ మరోవైపు అన్ స్టాపబుల్ టాక్ షో తో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం రెండవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ ఎపిసోడ్ లో అతిథులుగా యంగ్ హీరోలైన విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు.
ఇక ఈ ఇద్దరు హీరోలు వేదిక పైకి రాగానే బాలకృష్ణ గారితో కలిసి పెద్ద ఎత్తున ఆటపాటలతో సందడి చేశారు. ఇక బాలకృష్ణ కూడా వీరి వృత్తిపరమైన విషయాల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే విశ్వక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారితో మాట్లాడారు. విశ్వక్ తల్లిదండ్రులు తన కొడుకు గురించి ఎంతో గొప్పగా చెబుతూ వచ్చారు.
ఇకపోతే విశ్వక్ తమతో కలిసి గడపడానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారంటూ తన తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఆయన నెలలో పది రోజులు మాతో సమయం కేటాయిస్తారని చెప్పారు. అయినా తమతో సమయం గడపలేకపోతున్నారని విశ్వక్ తండ్రి వెల్లడించారు.ఇలా విశ్వక్ తండ్రి చెప్పడంతో వెంటనే బాలకృష్ణ కూడా నేను కూడా నా భార్య వసుంధరకు ఇలాంటి ఎన్నో ఒట్లు వేశానని సమాధానం చెప్పారు.
ప్రతి ఆదివారం నేను షూటింగ్ కు వెళ్లకుండా ఎలాంటి పనులు చేయకుండా ఇంటికి పరిమితమవుతానని మాట ఇచ్చాను. అయితే ఎప్పుడు మాటపై నిలబడలేదని ఆ విషయంలో మాట తప్పానంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ తన భార్య వసుంధరకు ఇచ్చిన మాట గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమా షూటింగులతో కూడా బిజీగా గడుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…