తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం… సీనియర్ నటుడు రాజబాబు మృతి..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న రాజబాబు గత రాత్రి తుది శ్వాస విడిచారు. రాజబాబు మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. రాజబాబుకు భార్య ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసరావుపేట. చిన్నప్పటి నుంచి రాజబాబుకు నటనపై ఆసక్తి ఉండేది. అలా 1995లో ఊరికి మొనగాడు సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సింధూరం, సముద్రం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, భరత్ అనే నేను లాంటి చిత్రాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం, రాధమ్మ పెళ్లి ఇలాంటి సినిమాలను సైతం నిర్మించారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మృదుస్వభావి గా రాజబాబుకు పేరుంది. ఇతను సినిమాల కంటే ఎక్కువగా సీరియల్ తోనే గుర్తింపును సంపాదించుకున్నారు. దాదాపుగా అరవై రెండు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఇక రాజబాబు మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

బుల్లితెరపై వసంతకోకిల, అభిషేకం, రాధ మధు, మనసు మమత, బంగారు పంజరం, మా కోడలు బంగారం లాంటి సీరియల్స్ లో నటించి అలరించారు. అంతేకాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే అమ్మ సీరియల్ లో రాజబాబు పాత్రకు నంది అవార్డు కూడా వచ్చింది. అయితే రాజబాబు మరణవార్త ఒక్కసారిగా ఆయన ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విన్న వెండితెర సెలబ్రెటీలు, బుల్లితెర సెలబ్రిటీలు సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.