Senior Actor Sri Vidhya : శ్రీ విద్యని ఒక టాప్ హీరో ప్రేమించి మోసం చేస్తే… మరో ఇద్దరు డైరెక్టర్లు వాడుకుని వదిలేసారు… చివరికి దీనస్థితిలో ఎలా చనిపోయిందంటే : ఇమంది రామారావు

Senior Actor Sri Vidhya : సింగర్ వసంత కుమారి, కమెడియన్ కృష్ణమూర్తిల కుమార్తె అయిన అలనాటి నటి శ్రీ విద్య మళయాలి అయినా కూడా పుట్టి పెరిగింది తమిళనాడు చెన్నై. మొదటి నుండి సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం కావడం, తండ్రి అనారోగ్యంతో మరణించడం వల్ల శ్రీ విధ్య బాల నటిగా సినిమాల్లో అడుగుపెట్టారు. ఆపై హీరోయిన్ గా అటు మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు అలా దక్షిణాది నాలుగు భాషలలోనూ నటించారు. అయితే శ్రీ విద్య టాలెంట్, అందం రెండూ ఉండి కూడా కెరీర్ లో ఎదగలేక పోయారు. ఇక వ్యక్తిగతంగా కూడా ప్రేమ పేరుతో కొంతమంది మోసం చేయడం వల్ల క్రుంగిపోయారు. ఇక యాభైమూడేళ్ల వయసులో ఆమె అనారోగ్య కారణాలతో మరణించారు.

కమల్ హాసన్ తో ప్రేమలో… ఇద్దరు డైరెక్టర్ల చేతిలో…

ఇక సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు శ్రీ విద్య జీవితం గురించి మాట్లాడుతూ ఆమె చాలా దురదృష్టవంతురాలు అంటూ అభిప్రాయపడ్డారు. దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో ‘తూర్పు పడమర’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా నటించిన శ్రీ విద్య అప్పటికే మలయాళం, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హీరోయిన్ గా బాగానే బిజీగా ఉన్న శ్రీవిద్య తమిళ హీరో కమల్ హాసన్ తో ప్రేమలో పడింది.

అయితే కమల్ నీతో స్నేహం మాత్రమే చేశాను ప్రేమించలేదని చెప్పడంతో చాలా బాధపడిన శ్రీ విద్య ఆ తరువాత ఒక డైరెక్టర్ ను ప్రేమించి అతనిని పెళ్లి కూడా చేసుకుందట. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు, అతను మోసం చేశాడు. ఇక మరో సారి ఒక మలయాళం డైరెక్టర్ పెళ్లి చేసుకుంటానని అడుగగా పెళ్లి చేసుకున్న శ్రీ విద్య బరువెక్కడంతో ఒకవైపు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో భర్త పట్టించుకోవడం మానేసాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇష్టం లేకపోయినా ఆ పాత్రలను చేసింది. ఇక చివర్లో ఆర్థికంగా ఇబ్బందులు పడి అనారోగ్యంతో మరణించింది అయితే చివరి రోజుల్లో భర్త కూడా ఆమెను పట్టించుకోలేదు, ఇండస్ట్రీ వైపు నుండి కూడా ఏ మాత్రం సహాయం రాలేదంటూ ఇమంది గారు శ్రీవిద్య గురించి మాట్లాడారు.