Naresh – Pavithra Lokesh: గత కొద్ది రోజుల క్రితం నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడం నరేష్ భార్య ఈ వార్తలను ఖండించడంతో వీరి వ్యవహారం తీవ్ర వివాదాలకు కారణమైంది. ఈ వివాదం అనంతరం కాస్త సైలెంట్ కావడంతో వీరిద్దరూ విడిపోయారా అనే సందేహాలు కూడా తలెత్తాయి. అయితే తాజాగా నరేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి వీడియో వీరిద్దరి బంధం పవిత్ర బంధం అని నిరూపించుకున్నారు.
అలీ నిర్మాణంలో ఆయన హీరోగా నటించిన చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఈ సినిమా అక్టోబర్ 28వ తేదీ ఆహా ఓటీటీలో విడుదలైంది. ఇందులో నరేష్ పవిత్ర భార్యాభర్తలుగా నటించారు.వీరిద్దరి మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో ప్రతి ఒక్కరిని ఈ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే నిజజీవితంలో కూడా నరేష్ పవిత్రలు రిలేషన్ లో ఉండడంతో వీరి పాత్రలు సినిమాలో హైలైట్ అయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా గురించి ఎంతోమంది రివ్యూ ఇవ్వడంతో.. ఈ విజయం పై నరేష్ పవిత్ర మీడియా ముందు మాట్లాడారు.నేను ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించాను. అయితే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తోందని నరేష్ సంతోషం వ్యక్తం చేశారు.
Naresh – Pavithra Lokesh: పవిత్రపై చెయ్యి వేసి మాట్లాడిన నరేష్…
ఈ సినిమా విడుదలైన తర్వాత పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడం మెసేజ్లు చేయడం జరుగుతుందని సినిమాకి ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలంటూ ఈయన చెప్పుకొచ్చారు. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవుతాయని మరోసారి ఈ సినిమా నిరూపించిందని నరేష్ తెలిపారు.అయితే ఈయన మీడియా ముందు మాట్లాడే సమయంలో పక్కనే పవిత్ర ఉండటం విశేషం అలాగే తనపై చేయి వేసి నరేష్ మీడియా ముందు మాట్లాడటంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో నరేష్ అందరూ బాగుండాలి అందులో మేము.. నేను, పవిత్ర కూడా ఉండాలి అంటూ చెప్పడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…