Pruthvi Raj : ఈ మధ్య కాలంలో విడిపోవడం పెళ్లి చేసుకోవడం అన్నీ బాగా కామన్ అయిపోయాయి. విడిపోడానికి పెద్దగా కారణాలు ఉండటం లేదు, ఇక కలిసుండటానికి కారణాలు వెతుక్కోవడం లేదు ఇదంతా యువతరం మాత్రమే చేయడం లేదు. ఐదు పదుల వయసుదాటినవాళ్ళు కూడా విడాకులు, మళ్ళీ పెళ్లిళ్లు అంటున్నారు. మొన్నా మధ్య సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల సహజీవనం ఇక ఇప్పుడు సీనియర్ నటుడు పృథ్వీ రెండో పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యాయి. ‘రుక్కు రుక్కుమిని రమణి సుగుణమని’ పాట అనగానే గుర్తొచ్చే పేరు పృథ్వీ. ఆ పాట వచ్చి ఎన్నేళ్లయినా ఇప్పటికీ ఆయనను పెళ్లి సినిమా పృథ్వీ గానే గుర్తుపడతారు తెలుగు ప్రేక్షకులు. పెళ్లి సినిమా కంటే ముందే పృథ్వీ తెలుగులో సినిమాలు చేసినా పెళ్లి సినిమాతో వచ్చిన ఫేమ్ వల్ల పెళ్లి పృథ్వీ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు చేసినా మళ్ళీ సమర సింహ రెడ్డి, మన్మధుడు, చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే నటించాలనే నియమేమీ పెట్టుకోకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా నటించాడు పృథ్వీ.
57 వయసులో 24 ఏళ్ల అమ్మాయి తో ప్రేమ, పెళ్లి…
రెండో పెళ్లి పెద్ద విషయం కాదు కానీ నటుడు పృథ్వీ తనకంటే చాలా చిన్న వయసు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు అన్నదే హాట్ టాపిక్. 24 ఏళ్ల శీతల్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు పృథ్వీ. కొన్ని నెలల క్రితమే మొదటి భార్య బీనా తో విడాకులు తీసుకున్న పృథ్వీ చాలా రోజుల నుండి శీతల్ తో రిలేషన్ లో ఉన్నారు. శీతల్ తెలంగాణలో పుట్టి రాయలసీమలో పెరిగిన అమ్మాయి. ఇక కరోనా సమయంలో పృథ్వీతో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు, ప్రేమకు పెళ్లికి వయసు అడ్డుకదంటూ శీతల్ క్లారిటీ ఇస్తోంది.
ఇక వీరిద్దరికీ దాదాపు 33 ఏళ్ల తేడా ఉన్నా అది వాళ్ళ బందానికి అడ్డుకాదంటున్నారు వీళ్లిద్దరూ. ఇద్దరి మనసులు కలిసాక వయసుతో పనేముంది అంటూ స్టేటంట్స్ ఇస్తున్నారు. ఇక పృథ్వీ మాట్లాడుతూ మొదటి భార్య అనుమతి తోనే రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపారు. అరేళ్లుగా ఒంటరిగా ఉండి ఇక కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు ఒంటరితనంతో బాధపడినట్లు పృథ్వీ చెప్పారు. ఇక మొదటి భార్యతో మాట్లాడాక పరస్పర అంగీకారంతో సామరస్యంగా విడిపోయి శీతల్ తో పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…