Senior Actor Thulasi : విశ్వనాథ్ గారి వల్ల ఏడ్చేసాను… ఆరోజు చాలా అవమానంగా ఫీల్ అయ్యాను : సీనియర్ నటి తులసి

Senior Actor Thulasi : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి హీరోయిన్ గా, అలాగే ఇక హీరో చెల్లి పాత్ర, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తల్లిగా మెప్పించిన నటి తులసి మూడు వందలకు పైగా సినిమాల్లో నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు అందరు అగ్ర హీరోల సినిమాల్లో నటించిన తులసి అందరు గొప్ప దర్శకుతో పని చేయడం గొప్పగా ఉంటుంది అంటూ చెప్తున్నారు. ఇక సినిమాల్లో కే విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది, అందునా ‘శంకరాభరణం’ సినిమాలో శంకర్ శాస్త్రి వద్ద అబ్బాయిగా తులసి నటన అందరినీ అక్కట్టుకుంటుంది. ఆ ఒక్క సినిమాతో నటనలో వంద మెట్లు ఎక్కేసింది తులసి. ఇక ఈ మధ్యనే విడుదల అయిన కార్తికేయ 2 సినిమాలో కూడా తన నటనతో అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు.

ఆరోజు ఏడ్చేసాను… విశ్వనాధ్ గారు అలా చేసారు…

శంకరాభరణం సినిమాలో మగపిల్లాడి పాత్ర కోసం తులసి గారిని ఎంపిక చేసారు. ఇక అప్పట్లో అమ్మాయిలే అబ్బాయిల వేషం వేసేవారు. అయితే విగ్ పెట్టి షూటింగ్ కానిచ్చేవారు. కానీ ఈ సినిమా కోసం బాయ్ కట్ చేయించాలని విశ్వనాధ్ గారు చెప్పేసారట. దాంతో చేతిలో కేక్ పెట్టి తిని చూసేలోపు జుట్టు మొత్తం కత్తిరించేసారట, బాగా ఏడ్చారట తులసి. ఇక షూటింగ్ వెళ్ళాక ఇంకా కట్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇంకొంచం పొట్టిగా జుట్టును తయారు చేశారట ఆరోజు చాలా ఏడ్చాను అంటూ తులసి ఆమె అనుభవాలను పంచుకున్నారు.

ఇక చిరంజీవి గారి సినిమా ‘కోతలరాయుడు’ లో నటించేందుకు వెళ్ళినపుడు చిరంజీవి ముందు డైలాగు చెప్పాలి, అప్పటికే ఆరు టేకులు తీసుకున్న తులసి గారిని వారి తల్లి పక్కకు పిలిచి నిర్మాత ఎంత ఖర్చు పెడుతున్నది చెప్పి ఇలా ఇన్ని టేకులు తీసుకుంటే మిగతా వారికి కలిగే ఇబ్బందిని చెప్పి గట్టిగా అరిచారట. నీకు ఉన్న పేరు పోతుంది ఇక సినిమాల్లోకి నిన్ని తీసుకోరు అని తల్లి భయపెట్టేసరికి తులసి కి కంగారు పుట్టి ఏడో టేక్ లో సరిగా డైలాగు చెప్పి సీన్ పూర్తి చేశారట. అయితే ఆ రోజున తల్లి గట్టిగా మందలించినపుడు ఇంకోసారి ఇన్ని టేకులు తీసుకోరాదు అని అనుకుందట. ఆరోజు చాలా అవమానంగా ఫీల్ అయ్యానంటూ చెబుతూ ఇప్పటికీ అది మర్చిపోలేను అంటూ ఆమె అనుభవాలని పంచుకున్నారు.