Movie News

Anchor Anasuya: షర్ట్ చిరిగింది.. ఎయిర్ పోర్టులో యాంకర్ అనసూయకు అవమానం.. మండిపడుతున్న యాంకరమ్మ?

Anchor Anasuya:తెలుగు బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె వెండితెరపై అవకాశాలను అందుకోవడంతో వరుస సినిమాలతో ఎంతో బిజీగా అయ్యారు. ఇలా వరుస సినిమాలతో బిజీ కావడం వల్ల ఈమె బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు.

ఈ విధంగా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే కొన్ని పోస్టులకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.అయినప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ తన విషయాలన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఎయిర్ పోర్ట్ లో తనకు జరిగినటువంటి చేదు సంఘటన గురించి తెలియజేస్తూ ఎయిర్ లైన్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లినటువంటి అనసూయ తిరిగి హైదరాబాద్ రావడం కోసం ఆలియన్స్ ఎయిర్ లైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఫ్లైట్ 6:55 కి టేక్ ఆఫ్ కావాల్సి ఉండగా అరగంట పాటు ఆలస్యంగా వచ్చిందని తెలిపారు.

ఇలా ఫ్లైట్ ఆలస్యం కావడంతో అందరం కూడా వెయిట్ చేశామని అయితే ఫ్లైట్ టైం అవ్వడంతో లోపలికి వెళ్తుండగా మాస్క్ లేదని సెక్యూరిటీ తనని అక్కడే నిలబెట్టారని, తిరిగి మాస్క్ ధరించే వరకు తనని అలో చేయలేదంటూ తెలియజేశారు.అదేవిధంగా తన కుటుంబానికి మొత్తం ఒకే చోట ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయగా ఒక్కొక్కరిని ఒక్కోచోట కూర్చోబెట్టారంటూ ఈమె మండిపడ్డారు.

Anchor Anasuya: కనీసం సీట్లు కూడా సరిగా లేవు..

ఇక ఫ్లైట్లో కనీసం సీట్లు కూడా సరిగ్గా లేవని, అలా సీట్లు సరిగా లేని కారణంగా తన షర్టు కూడా చినిగిపోయింది అంటూ ఈ సందర్భంగా ఆలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ గురించి,తనకు జరిగిన చేదు సంఘటన గురించి ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 hour ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

19 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

19 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago